Chief Justice Lalit : గంట‌న్న‌ర ముందొస్తే త‌ప్పేంటి – సీజే లలిత్

సంచ‌ల‌న కామెంట్స్ చేసిన జ‌స్టిస్ లలిత్

Chief Justice Lalit : భార‌త దేశ ప్ర‌ధాన న్యాయూమ‌ర్తి జ‌స్టిస్ లలిత్ సంచ‌ల‌న కామెంట్స్ చేశారు. ఈ సంద‌ర్భంగా ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేయ‌డం క‌ల‌క‌లం రేపింది. పిల్ల‌లు ఉద‌య‌మే 7 గంట‌ల‌కు పాఠ‌శాల‌ల‌కు వెళుతున్నారు.

మ‌రి వాళ్ల‌కు లేని నిబంధ‌న మ‌న‌కు మాత్ర‌మే ఎందుకు ఉందంటూ ప్ర‌శ్నించారు చీఫ్ జ‌స్టిస్. ఇదిలా ఉండ‌గా ప్ర‌ధాన న్యాయ‌మూర్తిగా గత ఏడాది 2021 ఆగ‌స్టులో నియ‌మితుల‌య్యారు జ‌స్టిస్ ల‌లిత్(Chief Justice Lalit).

శుక్ర‌వారం ఓ కేసు విచార‌ణ చేప‌ట్టాల్సి ఉంది. ఇందుకు సంబంధించి టైమ్ కూడా నిర్ణ‌యించారు. ఉద‌యం 10.30 గంట‌ల‌కు రావాల్సి ఉంది చీఫ్ జ‌స్టిస్. కానీ ప్ర‌ధాన న్యాయ‌మూర్తి జ‌స్టిస్ ల‌లిత్ గంట ముందు గానే అంటే ఉద‌యం 9.30 గంట‌ల‌కే కోర్టుకు హాజ‌రయ్యారు.

దీంతో మిగ‌తా కోర్టులోని సిబ్బందితో పాటు ఇత‌రులు విస్తు పోయారు. ఈ సంద‌ర్భంగా చీఫ్ జ‌స్టిస్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ఉద‌యం 7 గంట‌ల‌కే పిల్ల‌లు చ‌దువుకునేందుకు బ‌డుల‌కు వెళుతున్నారు.

మ‌రి మ‌నం ఎందుకు ఓ గంట‌న్న‌ర ముందు వ‌స్తే త‌ప్పేంటి అని ప్ర‌శ్నించారు. ఒక ర‌కంగా న్యాయ‌స్థానాన్ని నిల‌దీశారు. ప్ర‌తి రోజూ 10.30 గంట‌ల‌కు కాకుండా 9 గంట‌ల‌కు ప్రారంభించాల‌ని కోరాడు.

ఆయ‌న గంట ముందుగానే త‌న విచార‌ణ‌ను ప్రారంభించారు. ఇదిలా ఉండ‌గా ముంద‌స్తు విచార‌ణ‌పై మాజీ అటార్నీ జ‌న‌ర‌ల్ ముక‌ల్ రోహ‌త్గీ సంతోషం వ్య‌క్తం చేశారు.

దీనిపై చీఫ్ జ‌స్టిస్ ల‌లిత్(Chief Justice Lalit) స‌మాధానం ఇచ్చారు. త్వ‌ర‌గా రావాల‌ని తాను కూడా ఎప్ప‌టి నుంచో న‌మ్ముతున్న‌ట్లు తెలిపాడు.

Also Read : పార్ల‌మెంట్ ప్రాంగ‌ణంలో ధ‌ర్నాలు బంద్

Leave A Reply

Your Email Id will not be published!