NV Ramana : భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ నూతల పాటి వెంకట రమణ (NV Ramana)దుబాయ్ లోని గురు ద్వారాను సందర్శించారు. గల్ఫ్ దేశలోని గురునానక్ దర్బార్ కు జస్టిస్ రమణతో పాటు ఆయన సతీమణి శివమాల, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తులు జస్టిస్ ఎల్ . నాగేశ్వర్ రావు, జస్టిస్ హిమా కోహ్లీ కూడా ఉన్నారు.
వారు కూడా సీజేఐతో పాటు గురు ద్వారా నానక్ ను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా పూజలు చేశారు. ఆ దేశ అత్యున్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తి మహ్మద్ హమద్ అల్ బాదీ ఆహ్వానం మేరకు అబుదాబి లోని యూఏఈ కేంద్ర సుప్రీంకోర్టును సీజేఐ(NV Ramana) సారథ్యంలోని న్యాయ మూర్తుల బృందం సందర్శించింది.
అనంతరం అబుదాబి లోని ఇండియా సోషల్ అండ్ కల్చరల్ సెంటర్ లో భారతీయ సంఘం ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమానికి సీజేఐ ఎన్ వీ రమణ హాజరయ్యారు.
ఈ సందర్భంగా జస్టిస్ ఎన్వీ రమణ ప్రసంగించారు. గల్ఫ్ దేశంలోని భారతీయులకు, ఇండియా సంస్థలకు ఎటువంటి న్యాయ సహాయం కావాలన్నా చేస్తామన్నారు.
ఇందు కోసమే తాము న్యాయ సహాయ కేంద్రాన్ని ఏర్పాటు చేశామన్నారు. ఇలాంటి కేంద్రాలు ఏర్పాటు కావాల్సిన అవసరం ఉందన్నారు.
ఇప్పటికే ఇండియాలో వీటిని ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకున్నామని చెప్పారు. ఆయా దేశాల మధ్య సత్ సంబంధాలు నెలకొల్పేలా ఇలాంటి కార్యక్రమాలు మరింత ఉపయోగ పడుతాయని తెలిపారు.
దుబాయ్ ని దర్శించడం, గురు నానక్ దర్బార్ ను సందర్శించడం తాను మరిచి పోలేనని చెప్పారు జస్టిస్ ఎన్వీ రమణ.
Also Read : చినజీయర్ కు అందని ఆహ్వానం