CJI Amrit Udyan : ‘అమృత్ ఉద్యాన్’ లో సీజేఐ..జడ్జీలు
సుప్రీంకోర్టు న్యాయమూర్తులు కూడా హాజరు
CJI Amrit Udyan : రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పిలుపు మేరకు భారత దేశ ప్రధాన న్యాయమూర్తి ధనంజయ వై చంద్రచూడ్ తో పాటు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు అమృత్ ఉద్యానాన్ని(CJI Amrit Udyan) సందర్శించారు. గతంలో రాష్ట్రపతి భవన్ లోని తోటలకు మొఘల్ గార్డెన్ అని పేరు ఉండేది. కానీ మోదీ ప్రభుత్వం అన్ని పేర్లను మార్చుకుంటూ వస్తోంది. ఇందుకు సంబంధించి మొఘల్ గార్డెన్ పేరు తీసి వేసి దానిని అమృత్ ఉద్యాన్ అని మార్చేసింది.
వచ్చే నెల మార్చి 21 దాకా దీనిని సందర్శించేందుకు రాష్ట్రపతి కార్యాలయం అనుమతి ఇచ్చింది. అమృత్ ఉద్యనాన్ని సందర్శించాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము స్వయంగా సీజేఐ, సుప్రీంకోర్టు న్యాయమూర్తులను ఆహ్వానించింది. ఈ మేరకు ఆదివారం సీజేఐతో పాటు న్యాయమూర్తులు అమృత్ ఉద్యానాన్ని సందర్శించారు.
ఈ సందర్బంగా అరుదైన ఫోటోలను రాష్ట్రపతి ట్వీట్ చేశారు. చాలా ఆనందంగా ఉందని పేర్కొన్నారు. రెండు నెలల పాటు తెరిచి ఉంచుతారు. సోమవారం ,మార్చి 8న హోళీ సందర్భంగా మూసి ఉంచుతారు. మిగతా రోజుల్లో అందరికీ ప్రవేశం ఉంటుంది.
మార్చి 28 నుంచి 31 మధ్య కొందరికి ప్రత్యేకంగా కేటాయించారు. 28న రైతులకు , 29న వికలాంగులకు , 30న రక్షణ దళాలు, పారా మిలిటరీ , పోలీసు సిబ్బందికి , 31న గిరిజన మహిళలు స్వయం సహాయక సంఘాల కు ప్రవేశం ఉంటుంది. రాష్ట్రపతి భవన్ ను ఎక్కువ మందికి అందుబాటులో ఉంచేందుకు ప్రతి గంట స్లాట్ సామర్థ్యాన్ని కూడా పెంచుతున్నట్లు తెలిపింది రాష్ట్రపతి కార్యాలయం. ప్రతి ఒక్కరు దర్శించుకునేలా చేయాలనేది రాష్ట్రపతి కోరిక.
Also Read : ఐదుగురు న్యాయమూర్తులకు ఓకే