PM Modi Rakshabandan : మోదీకి రాఖీ కట్టిన పీఎంఓ సిబ్బంది చిన్నారులు
ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపిన ప్రధాన మంత్రి
PM Modi Rakshabandan : రక్షా బంధన్ (రాఖీ పండుగ)ను దేశ వ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా అరుదైన సన్నివేశం చోటు చేసుకుంది.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పీఎంఓ కార్యాలయంలో పని చేస్తున్న స్వీపర్లు, ప్యూన్లు, గార్డెనర్లు, డ్రైవర్లు, ఇతరుల కూతుళ్లు (చిన్నారులు) గురువారం మోదీని కలుసుకున్నారు.
ఈ సందర్భంగా ప్రధాన మంత్రికి రాఖీలు కట్టారు. వారందరికీ నరేంద్ర మోదీ(PM Modi) ప్రత్యేక బహుమతులు అందజేశారు. ప్రస్తుతం చిన్నారులు కట్టిన రాఖీలకు సంబంధించిన పీఎం ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.
అంతకు ముందు రక్షా బంధన్ సందర్భంగా ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ట్విట్టర్ వేదికగా ఆయన దేశ ప్రజలందరూ కలకాలం సుఖ సంతోషంగా ఉండాలని కోరారు.
కాగా రక్షా బంధన్ ను పురస్కరించుకుని ప్రధాన మంత్రి ఇంటి వద్ద జరిగిన ఈ ప్రత్యేక రక్షా బంధన్(Rakshabandan) వేడుకలో పాల్గొన్నారు పెద్ద ఎత్తున. ఇవాళ పీఎంఓ కార్యాలయంలో పండుగ వాతావరణం నెలకొంది.
ఈ వేడుకులకు సంబంధించిన వీడియోను , వారితో ప్రధాని పరస్పర చర్యను అధికారులు పంచుకున్నారు. అన్నా చెల్లెళ్ల అనుబంధానికి రాఖీ పండగ ప్రతీక.
ఈ సంప్రదాయం ఒక్క భారత దేశంలో మాత్రమే ఉందన్నారు నరేంద్ర మోదీ. ప్రపంచంలో ఎక్కడా ఇలాంటిది లేదన్నారు. అన్నా చెల్లెళ్ల అనుబంధానికి కొండ గుర్తు ఈ రాఖీ కట్టడం.
తాను ఎల్లప్పటికీ ఈ రోజును గుర్తు పెట్టుకుంటానని ఈ సందర్భంగా స్పష్టం చేశారు ప్రధాన మంత్రి. మోదీ చిన్నారులతో సరదాగా గడిపారు.
Also Read : ఉప రాష్ట్రపతిగా కొలువు తీరిన ధన్ ఖర్
A very special Raksha Bandhan with these youngsters… pic.twitter.com/mcEbq9lmpx
— Narendra Modi (@narendramodi) August 11, 2022