Wang To : భారత్, చైనా దేశాల మధ్య ఆధిపత్య పోరు నడుస్తూనే ఉంది. చైనా ఓ వైపు దాని అండ చూసుకుని పాకిస్తాన్ మరో వైపు ఇండియాతో కయ్యానికి కాలు దువ్వుతూనే ఉన్నాయి.
ఈ తరుణంలో చైనా ఉన్నట్టుండి తన మనసు మార్చుకుంది. ఈ మేరకు ఇరు దేశాల సంబంధాల విషయంలో చైనా కీలక కామెంట్స్ చేసింది. ఇరు పక్షాలు ప్రత్యర్థులుగా కాకుండా భాగస్వాములుగా మారుదామని ఆహ్వానం పలికింది.
ఇందులో భాగంగానే ఆ దేశ విదేశాంగ శాఖ మంత్రి వాంగ్ యీ (Wang To )ఇవాళ అంతర్జాతీయ మీడియాతో మాట్లాడారు. ఇరు దేశాలు ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశాలుగా ఉన్నాయని పేర్కొన్నారు.
ఇరు దేశాలు స్నేహంగా ఉంటూ విరుధోనాకి చెక్ పెట్టాలని సూచించారు. భాగస్వామ్యులుగా ఉందామని సూచించారు. ఎవరికి వారు స్నేహాంగా ఉంటూనే తమ తమ లక్ష్యాలను చేరుకునేందుకు ప్రయత్నాలు చేద్దామని పిలుపునిచ్చారు వాంగ్ యీ.
నిత్యం సంఘర్షణలు, విరోధాలు, గిల్లి కజ్జాలకు చెక్ పెడదామంటూ స్పష్టం చేశారు. ఇరు దేశాలు కలిసి ఉంటే, స్నేహంగా మలిగితే ఇక ప్రపంచంలో ఏ దేశమూ మన దరి దాపుల్లోకి రావన్నారు.
గత కొన్నేళ్లుగా ఇరు దేశాల మధ్య సరిహద్దు వివాదాలు మరింత ఉద్రిక్తంగా మారాయని వాటిని కలిసి కూర్చుని చర్చించు కోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.
ఈ సమయంలో ఆయన ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఇరు దేశాల మధ్య ఉన్న అనుబంధాన్ని చెరిపి వేసేందుకు కొన్ని దేశాలు ప్రయత్నాలు చేస్తున్నాయంటూ ఆరోపించారు.
కాగా ఉక్రెయిన్, రష్యా దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతను తగ్గించేందుకు సయోధ్య కు ప్రయత్నం చేస్తామన్నారు.
Also Read : తల వంచేంత దాకా యుద్దమే