China Blocks India US : పాక్ ఉగ్రవాదుల లిస్టు వెల్లడికి చైనా చెక్
అమెరికా, భారత ప్రయత్నాలకు అడ్డంకి
China Blocks India US : అమెరికా, భారత దేశ ప్రయత్నాలకు చెక్ పెట్టింది చైనా(China Blocks India US) . ఐక్యరాజ్యసమితిలో పాకిస్తాన్ టెర్రరిస్టుల జాబితా వెల్లడించేందుకు ప్రవేశ పెట్టిన యుఎస్, ఇండియాకు కోలుకోలేని షాక్ ఇచ్చింది.
యుఎన్ లో పాకిస్తాన్ ఉగ్రవాదాలు ఎవరు ఉన్నారనే దానికి సంబంధించిన జాబితాను తయారు చేసేందుకు భారత్, దాని మిత్ర దేశాల ఎత్తుగడలను చైనా ముందుగానే పసిగట్టింది.
పదే పదే అడ్డుకుంది. పాకిస్తాన్ కు చెందిన ఉగ్రవాది అబ్దుల్ రెహ్మాన్ మక్కీని ఐఎస్ఐఎస్ , ఐఎస్ లోని అల్ ఖైదా ఆంక్షల కమిటీ కింద గ్లోబల్ టెర్రరిస్ట్ గా చేర్చాలని ఐక్యరాజ్య సమితిలో భారత్, అమెరికా(China Blocks India US) సంయుక్తంగా ప్రతిపాదన చేసింది.
దీనిని చైనా చివరి నిమిషంలో అడ్డుకుంది. లష్కరే తోయిబా చీఫ్, 26/11 సూత్రధారి హఫీస్ సయీద్ బావనే ఈ మక్కీ. అతడిని ప్రపంచ ఉగ్రవాదిగా గుర్తించి ప్రకటించాలని నిర్ణయించారు ఈ రెండు దేశాలు.
కాగా బీజింగ్ అడ్డుకట్ట వేసింది. ఇదిలా ఉండగా ఇంతకు ముందు కూడా పాకిస్తాన్ ఆధారిత ఉగ్రవాదులను జాబితా చేసేందుకు భారత దేశం , దాని మిత్ర దేశాలను చైనా అడ్డుకుంది.
ఈ రకంగా చైనా తన ఉద్దేశాన్ని మరోసారి బయట పెట్టింది. మే 2019లో పాకిస్తాన్ కు చెందిన జైష్ ఎ మహ్మద్ చీఫ్ మసూద్ అజార్ ను గ్లోబల్ టెర్రరిస్ట్ గా గుర్తించడంలో భారత దేశం యుఎన్ లో ఆమోదించేలా సక్సెస్ అయ్యింది.
2020లో పాకిస్తానీ ఉగ్రవాద వ్యతిరేక కోర్టు మక్కీకి జైలు శిక్ష విధించింది. గతంలో దోషులుగా ఉన్న వారిని విడుదల చేయడం మరింత ప్రమాదానికి దారి తీసింది.
Also Read : ఫెర్డినాండో తప్పుకున్నాడా తప్పించారా