NSA Ajit Doval US : ప్రపంచానికి చైనా పెను సవాల్ – యుఎస్
ఇండియా..అమెరికా దేశాల మధ్య చర్చ
NSA Ajit Doval US : అమెరికా సంచలన వ్యాఖ్యలు చేసింది. ప్రపంచంలో ఇప్పటి దాకా నువ్వా నేనా అనే రీతిలో పోటీ పడుతూ వస్తున్నాయి చైనా, అమెరికా. భారత దేశ జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవెల్(NSA Ajit Doval US ) ప్రస్తుతం యుఎస్ పర్యటనలో ఉన్నారు. ఈ సందర్బంగా అమెరికా చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్స్ తో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ప్రపంచంలో ప్రస్తుతం చోటు చేసుకుంటున్న పరిణామాలు, ఎదురవుతున్న సవాళ్లపై విస్తృతంగా చర్చించారు.
ఈ సందర్భంగా యుఎస్ సెక్యూరిటీ చీఫ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రపంచానికి ముఖ్యంగా భారత దేశానికి డ్రాగన్ చైనా పెను సవాల్ గా మారిందని హెచ్చరించారు. ఇందుకు సంబంధించి అన్ని దేశాలు కలిసికట్టుగా ఎదుర్కోవాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు మార్క్ మిచెల్. క్లిష్టమైన, అభివృద్ది చెందుతున్న సాంకేతికతలను ఇరు దేశాలు అంది పుచ్చుకోవడం అవసరమని పేర్కొన్నారు. వ్యూహాత్మక ప్రయోజనాలకు ఉపయోగ పడుతుందని వైట్ హౌస్ అధికారి అభిప్రాయపడ్డారు.
అజిత్ దోవల్ వైట్ హౌస్ లో యుఎస్ తో ఫలవంతమైన చర్చలు జరిపారు. వాషింగ్టన్ , న్యూ ఢిల్లీ వ్యూహాత్మక , శాస్త్రీయ విధానాలను ప్రత్యేకంగా సాంకేతిక రంగంలో ముందుకు సాగాలని నిర్ణయించుకున్నాయని ఈ సందర్భంగా భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ స్పష్టం చేశారు.
రెండు దేశాలు భద్రత గురించే ఎక్కువగా ఫోకస్ పెట్టినట్లు సమాచారం. యుఎస్ ఇండియా డిఫెన్స్ , ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంభాషణ అనేది బహుళ స్థాయి విధానం . ఒక రకంగా చెప్పాలంటే చైనా దూకుడుకు ముకుతాడు వేయాల్సిన అవసరం ఉందన్నారు.
Also Read : అలుపెరగని యోధుడు శాంతి భూషణ్