China India : లంక‌కు సాయంపై భార‌త్ కు చైనా కితాబు

బార‌త దేశంతో క‌లిసి సాగేందుకు సిద్దం

China India : ఇది ఊహించ‌ని ప‌రిణామం. భార‌త్ చైనా దేశాల మ‌ధ్య ఉద్రిక్త వాతావ‌ర‌ణం నెల‌కొన్న త‌రుణంలో చైనా ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసింది.

తీవ్ర ఆర్థిక సంక్షోభంతో కొట్టు మిట్టాడుతున్న శ్రీ‌లంక దేశానికి ఆప‌న్న హ‌స్తం అందించినందుకు ప్ర‌త్యేకంగా భార‌త(China India) ప్ర‌భుత్వాన్ని అభినందించింది.

ఈ మేర‌కు ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించింది. ఇదిలా ఉండ‌గా ప్ర‌పంచ దేశాల‌కు గోధుమ‌ల ఎగుమ‌తుల‌పై ఇటీవ‌ల అసాధార‌ణ నిర్ణ‌యం తీసుకుంది.

ఈ మేర‌కు ఎగుమ‌తుల‌పై నిషేధం విధిస్తున్న‌ట్లు ప్ర‌క‌టించింది. ప్ర‌ధానంగా ఉక్రెయిన్, ర‌ష్యా యుద్దం కార‌ణంగా నెల‌కొన్న ఇబ్బందుల దృష్ట్యా ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు తెలిపింది.

ఇదిలా ఉండ‌గా ఒక్క శ్రీ‌లంక‌కే కాదు తాలిబాన్లు అక్ర‌మంగా స్వాధీనం చేసుకున్న ఆఫ్గ‌నిస్తాన్ కు సైతం మాన‌వ‌తా దృక్ఫ‌థంతో భార‌త దేశం నాణ్య‌మైన గోధుమ‌లు, క‌రోనా నివార‌ణ కోసం వాడే వ్యాక్సిన్లు, మందుల్ని ఉచితంగా స‌ర‌ఫ‌రా చేసింది.

ఈ విష‌యాన్ని ఆఫ్గ‌నిస్తాన్ పాల‌కులు ప్రశంసించారు . ఇదిలా ఉండ‌గా భార‌త్ ,చైనా(China India) దేశాలు నువ్వా నేనా అన్న ప్ర‌స్తుత త‌రుణంలో చైనా ఓ అడుగు ముందుకేసి భార‌త్ కు కితాబు ఇవ్వ‌డం ప్రాధాన్య‌త‌ను సంత‌రించుకుంది.

ప్ర‌పంచంలో ఇప్పుడు చైనా టాప్ లో కొన‌సాగుతోంది. ఓ వైపు అమెరికా రోజు రోజుకు త‌న ప్రాభ‌వాన్ని కోల్పోయే స్థితికి చేరుకుంది. నిరంత‌రం కాల్పుల మోత‌ల‌తో ఆ దేశం ద‌ద్ద‌రిల్లుతోంది.

ఇంకో వైపు ఆర్థిక రంగంలోనూ, మార్కెట్ ప‌రంగా చైనా ఇప్పుడు ఆధిప‌త్యాన్ని ప్ర‌ద‌ర్శించ‌డం పెద్ద‌న్న‌ను కోలుకోలేకుండా చేస్తోంది.

ఇదే స‌మ‌యంలో శ్రీ‌లంక‌తో పాటు ఇత‌ర అభివృద్ధి చెందుతున్న దేశాలు వీలైనంత త్వ‌ర‌గా క‌ష్టాల నుంచి బ‌య‌ట ప‌డేసేందుకు భార‌త్ తో క‌లిసి ప‌ని చేసేందుకు చైనా సిద్దంగా ఉంద‌ని స్ప‌ష్టం చేశారు.

Also Read : ఇరాన్ మంత్రి కామెంట్స్ అర్థ‌ర‌హితం

Leave A Reply

Your Email Id will not be published!