China USA : తైవాన్ పై దాడికి పాల్పడాలని ప్రయత్నం చేస్తే తాము చూస్తూ ఊరుకోబోమంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన అమెరికాకు కోలుకోలేని రీతిలో షాక్ ఇచ్చింది చైనా.
అమెరికా దేశ అధ్యక్షుడు జోసెఫ్ బైడన్ చేసిన కామెంట్స్ పై చైనా(China USA) సర్వాధ్యక్షుడు జిన్ పింగ్ నిప్పులు చెరిగారు. తమ జోలికి రావాలని చూస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరికలు జారీ చేశారు.
ఎవరి పరిధుల్లో వాళ్లుండడం అన్నది ప్రస్తుతం ముఖ్యమని, కాదని కయ్యానికి కాలు దువ్వాలని ప్రయత్నం చేస్తే తాము చేతులు ముడుచుకుని కూర్చోలేదన్న సంగతి బైడెన్ గ్రహించాలని సూచించారు.
ఒకవేళ కాదని కదన రంగంలోకి దూకితే ఎవరి బలం ఏమిటో ఏపాటిదో ప్రపంచానికి కూడా తెలుస్తుందన్నారు. దీంతో అమెరికా, చైనా దేశాల మధ్య మరింత ఆధిపత్య పోరుకు తెర తీసేలా చేశాయి బైడెన్ కామెంట్స్.
ఎవరూ తక్కువగా అంచనా వేయొద్దంటూ మరోసారి హెచ్చరికలు జారీ చేస్తున్నట్లు చైనా విదేశాంగ శాఖ మంత్రి ఫైర్ అయ్యారు. తైవాన్ వ్యవహారం అన్నది చైనా(China USA) సార్వభౌమాధికారం,
అంతర్గత సమగ్రతకు సంబంధించిన అంశమని స్పష్టం చేశారు. ఇంకోసారి తైవాన్ పై మాట తూలినా తాము ఊరుకునే ప్రసక్తి లేదని మండిపడింది చైనా.
ఇదిలా ఉండగా చైనా గనుక బలవంతంగా తైవాన్ ను ఆక్రహించు కోవాలని లేదా ఆధీనంలోకి తీసుకోవాలని ప్రయత్నం చేస్తే తాము ఊరుకోబోమంటూ పేర్కొన్నారు జో బైడెన్.
ఇదే సమయంలో తమ సైనిక దళం తైవాన్ కు మద్ధతుగా ఉంటుందని స్పష్టం చేశారు. దీనిపై తాజాగా చైనా స్పందించింది.
Also Read : తైవాన్ పై దాడి చేస్తే ఊరుకోం