China Warns Third Parties : ఇత‌రుల జోక్యాన్ని స‌హించం – చైనా

చైనా స్పై నౌక‌పై అభ్యంత‌రంపై కామెంట్స్

China Warns Third Parties : భార‌త‌, చైనా దేశాల మ‌ధ్య మ‌రోసారి రాద్దాంతం చోటు చేసుసుకుంది. ఇప్ప‌టికే ఇరు దేశాల స‌రిహ‌ద్దుల మ‌ధ్య గొడ‌వ జ‌రుగుతోంది. ఇదిలా ఉండ‌గా శ్రీ‌లంక‌కు సాయం పేరుతో చైనాకు చెందిన నిఘా నౌక‌ను మోహ‌రించింది.

ఆ గూఢ‌చారి నౌక మంగ‌ళ‌వారం ఉద‌యం 8.30 గంట‌ల‌కు శ్రీ‌లంక‌లోని ఓడ రేవుకు చేరుకుంది. దీనిపై తీవ్ర అభ్యంత‌రం వ్య‌క్తం చేసింది భార‌త ప్ర‌భుత్వం. శ్రీ‌లంక మొద‌ట వ‌ద్ద‌ని చైనాకు చెప్పింది.

కానీ చైనా తీవ్ర‌మైన ఒత్తిడి తీసుకు వ‌చ్చింది. దీంతో గ‌త్యంత‌రం లేని ప‌రిస్థితుల్లో శ్రీ‌లంక అనుమ‌తి ఇచ్చింది. దీని విష‌యంపై సీరియ‌స్ వార్నింగ్ ఇచ్చింది శ్రీ‌లంక‌కు. చైనా గూఢ‌చారి నౌక ఏర్పాటు వ‌ల్ల భార‌త్ కు పెను ముప్పు ప్ర‌మాదం వాటిల్ల‌నుంది.

మ‌న దేశానికి చెందిన క్షిపణుల ర‌హ‌స్యాల‌ను స్కాన్న‌ర్ల ద్వారా నౌక గుర్తించనుంద‌ని ఆందోళ‌న చెందుతోంది భార‌త్. ఇదే విష‌యాన్ని ఖ‌రాఖండిగా లంకకు స్ప‌ష్టం చేసింది.

కానీ శ్రీ‌లంక‌కు పెద్ద ఎత్తున రుణాలు ఇచ్చింది చైనా. దీంతో ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో వాటిని తీర్చే స్థితిలో లేదు. దీంతో ఓడ‌రేవును 99 ఏళ్ల పాలు లీజుకు ఇచ్చింది చైనాకు శ్రీ‌లంక‌.

ఇక దానిని అడ్డం పెట్టుకుని స‌ముద్ర భూభాగంపై ప‌ట్టు సాధించేందుకు చైనా ప్ర‌య‌త్నం చేస్తోంది. ఈ త‌రుణంలో భార‌త్, శ్రీ‌లంక‌, చైనా మ‌ధ్య జ‌రుగుతున్న ఈ అంత‌ర్యుద్దంలో ఏ దేశమూ జోక్యం చేసుకోవ‌డానికి వీలు లేదంటూ తాజాగా హెచ్చ‌రిక‌లు జారీ చేసింది చైనా(China Warns Third Parties).

ఒక‌వేళ అలా చేస్తే తీవ్ర ప‌రిణామాలు ఎదుర్కోవాల్సి వ‌స్తుంద‌ని హెచ్చ‌రించింది.

Also Read : చైనా నిఘా నౌక పై భార‌త్ ఆందోళ‌న

Leave A Reply

Your Email Id will not be published!