India China Talks : భారత, చైనా దేశాల మధ్‌య ఉద్రిక్తతలు నెలకొన్న తరుణంలో చైనా విదేశాంగ శాఖ మంత్రి వాంగ్ యీ తో ఇవాళ భారత దేశ జాతీయ సలహాదారు అజిత్ దోవల్ (India China Talks)సమావేశం అయ్యారు.
ఈ భేటీ ప్రపంచ వ్యాప్తంగా అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. ఇదిలా ఉండగా తమ దేశానికి రావాలని చైనా అజిత్ దోవల్ ను ఆహ్వానించింది.
అయితే ఇరు దేశాల మధ్య నెలకొన్న సమస్యలను పరిష్కరించుకున్న తర్వాత ఆలోచిస్తామని ఈ సందర్భంగా అజిత్ ధోవల్ (India China Talks)స్పష్టం చేశారు.
లడఖ్ ప్రతిష్టంభన, ఉక్రెయిన్ లో సంక్షోభం , భౌగోళిక రాజకీయ చిక్కులు , ఇతర కీలక అంశాలపై దృష్టి సారించాయి ఇరు దేశాలు. వీటిపై ప్రధానంగా అజిత్ దోవల్ , వాంగ్ యి చర్చలు జరిపారు.
ఇదిలా ఉండగా చైనా విదేశాంగ శాఖ మంత్రి నిన్న సాయంత్రం ఢిల్లీ చేరుకున్నారు. రెండు సంవత్సరాల కిందట సైనిక ప్రతిష్టంభన ప్రారంభమైన తర్వాత చైనాకు చెందిన సీనియర్ మంత్రి భారత దేశాన్ని సందర్శించడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం.
శుక్రవారం ఉదయం 10 గంటలకు అజిత్ ధోవల్ కార్యాలయానికి చేరుకున్నారు మంత్రి. చర్చలు సుహృద్భావ వాతావరణంలో జరిగాయని సమాచారం.
ఇరు దేశాల మధ్య నెలకొన్న ప్రతిష్టంభనల్ని తొలగించు కోవడం, కలిసి ఉమ్మడిగా ముందుకు సాగాలని నిర్ణయించినట్లు తెలిపారు.
ముఖ్యంగా ఉద్రిక్త వాతావరణ పరిస్థితులు చక్క బడేలా కృషి చేసేందుకు ఇరు దేశాల ప్రతినిధులు ఓ అంగీకారానికి వచ్చాయి. ప్రస్తుత పరిస్థితిని కొనసాగించడం ఎంత మాత్రం మంచిది కాదని అభిప్రాయ పడ్డారు.
Also Read : బెంగాల్ ఘటన కేసు సీబీఐకి బదిలీ