Qin Gang : భారత్ కు రానున్న చైనా విదేశాంగ మంత్రి
ప్రకటించిన చైనా ప్రభుత్వం
Qin Gang India Visit : చైనా, భారత దేశాల మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న ప్రస్తుత తరుణంలో కీలక ప్రకటన చేసింది చైనా. ప్రస్తుతం భారత్ జి20 గ్రూప్ కు నాయకత్వం వహిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అన్ని దేశాలకు చెందిన విదేశాంగ శాఖ మంత్రులను ఆహ్వానించింది ఇండియాకు. కేంద్ర ప్రభుత్వం విస్తృతంగా ఏర్పాట్లు కూడా చేసింది. ఇప్పటికే అమెరికా విదేశాంగ శాఖ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ భారత్ కు చేరుకున్నారు. కీలక అంశాలపై చర్చలు జరగనున్నాయి.
ఈ తరుణంలో చైనా చేసిన ప్రకటన ఆసక్తికరంగా మారింది. జీ20 సమావేశానికి తమ దేశం తరపు నుంచి కొత్తగా నియమితులైన విదేశాంగ శాఖ మంత్రి క్విన్ గాంగ్ హాజరవుతారని వెల్లడించింది అక్కడి సర్కార్. ఈ మేరకు కీలక ప్రకటన చేసింది. ఇదే సమయంలో దేశ విదేశాంగ శాఖ మంత్రి సుబ్రమణ్యం జై శంకర్ తో కూడా భేటీ కానున్నారని తెలిపింది. ఈ వారంలోనే క్విన్ గాంగ్ భారత్ లో పర్యటిస్తారని(Qin Gang India Visit) చైనా తెలిపింది.
వివాదాస్పద సరిహద్దు వద్ద పరిస్థితిని అంచనా వేసేందుకు, దౌత్య, సైనిక చర్చల ఫలితాలను అంచనా వేసేందుకు అవకాశం ఉంది. ఈ మేరకు ఇద్దరు మంత్రులు వీటిపైనే చర్చించనున్నారు. క్విన్ గాంగ్ జై శంకర్ తో ద్వైపాక్షిక సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు. వీరిద్దరి భేటీ కీలకం కానుంది. భారత విదేశాంగ శాఖ మంత్రి జై శంకర్ ఆహ్వానం మేరకు క్విన్ గాంగ్(Qin Gang) మార్చి 2న న్యూఢిల్లీలో జరిగే జ20 సమావేశానికి హాజరవుతారని తెలిపింది చైనా.
Also Read : భారత్ కు చేరుకున్న ఆంటోనీ బ్లింకెన్