Chinna Jeeyar Swamy : అలా అన లేదు సీఎంతో గ్యాప్ లేదు
శ్రీశ్రీశ్రీ త్రిదండి రామానుజ చినజీయర్ స్వామి
Chinna Jeeyar Swamy : తనపై వస్తున్న ఆరోపణలకు శ్రీశ్రీశ్రీ త్రిదండి రామానుజ చిన జీయర్ స్వామి(Chinna Jeeyar Swamy )సమాధానం ఇచ్చారు. గత కొంత కాలంగా తెలంగాణ సమాజం యావత్తు స్వామిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.
సమ్మక్క , సారలమ్మలను దూషించినట్లు వస్తున్న ఆరోపణలను ఖండించారు. తాను అలా అనలేదని, ప్రత్యేకంగా సీఎం కేసీఆర్ తో తనకు ఎలాంటి గ్యాప్ లేదని స్పష్టం చేశారు.
అవతలి వాళ్లు దూరమైతే తాను ఏమీ చేయలేమన్నారు. సదుద్దేశంతో కార్యక్రమాలు చేస్తున్నామని , ప్రత్యేకించి మహిళల కోసం శిబిరాలు ఏర్పాటు చేశామని తెలిపారు. మహిళలంటే తమకు ఎనలేని గౌరవమని చెప్పారు చినజీయర్ స్వామి(Chinna Jeeyar Swamy ).
తనకు రాజకీయాలు పడవని, ప్రత్యేకించి మీడియాతో కూడా దూరంగా ఉంటానని తెలిపారు. ఇటీవల సమతా మూర్తి ఏర్పాటు సందర్భంగా మాట్లాడానే తప్పా తన పనిలో తాను నిమగ్నమయ్యానని చెప్పారు చిన జీయర్ స్వామి.
20 ఏళ్ల కిందట తాను మాట్లాడింది ఇప్పుడు తెర పైకి తీసుకు వచ్చారని ఆరోపించారు. తాను చేసిన వ్యాఖ్యల్ని వక్రీకరించేందుకు యత్నించారని ఆరోపించారు.
పనిగట్టుకుని తనపై ఫోకస్ పెట్టి మాట్లాడటం వారి విజ్ఞతకే వదిలి వేస్తున్నట్లు చెప్పారు. తాము ఎప్పుడూ దురుద్దేశ పూర్వక కామెంట్స్ చేయలేదని స్పష్టం చేశారు.
తాత్పార్యం తెలుసు కోకుండా ఆరోపణలు చేస్తే వారిపై జాలి పడాల్సి వస్తోందన్నారు. సొంత లాభం కోసమే వివాదం చేస్తున్నారంటూ వాపోయారు.
తమకు కులం, మతం అనే తేడా లేదని పేర్కొన్నారు చిన జీయర్ స్వామి. సమాజ హితం కోరుకోని వారే ఇలాంటివి ప్రచారం చేస్తున్నారంటూ మండిపడ్డారు చిన జీయర్ స్వామి.
Also Read : హోళీ వేళ… తెలంగాణ ఆర్టీసీ చార్జీల వడ్డన