Chinnajeeyar : చిన్న‌జీయ‌ర్ ఆశీర్వాదం కేసీఆర్ సంతోషం

స‌మ‌తామూర్తి కేంద్రం తెలంగాణ‌కు త‌ల‌మానికం

Chinnajeeyar : జ‌గ‌త్ గురు శ్రీ‌శ్రీ‌శ్రీ త్రిదండి రామానుజ చిన్నజీయ‌ర్ స్వామి ఆశీస్సుల కోసం, మంగ‌ళా శాస‌నాల కోసం భ‌క్త జ‌నం ఎదురు చూస్తూ ఉంటారు. ఆ మ‌హ‌త్ భాగ్యం క‌ల‌గాలంటే దైవం అనుగ్ర‌హం ఉండాలి. అప్పుడే స్వామి వారి క‌రుణ కటాక్షం క‌లుగుతుంది.

భ‌క్తి భావ‌మే కాదు స‌త్య నిష్ట‌త కూడా ఉండ‌డం ముఖ్యం. ధ‌ర్మ‌బ‌ద్దంగా ఉంటేనే భ‌క్తి అన్న‌ది అల‌వ‌డుతుంద‌ని స్ప‌ష్టం చేస్తారు. భ‌క్తుల‌కు బోధిస్తారు జ‌గ‌త్ గురు శ్రీ చిన్న‌జీయ‌ర్ స్వామి(Chinnajeeyar).

ప్ర‌పంచంలో ఏ పీఠాధిప‌తి చేయ‌ని విధంగా శ్రీ స్వామి వారు స‌త్ సంక‌ల్పానికి శ్రీ‌కారం చుట్టారు. ప‌ది సంవ‌త్స‌రాల‌కు పైగా శ్ర‌మించారు. త‌న శ‌క్తియుక్తుల‌న్నింటినీ ధార పోశారు.

చివ‌ర‌కు అనుకున్న‌ది సాధించారు. అదే శ్రీ‌రామ‌న‌గ‌రంలో న‌భూతో న‌భ‌విష్య‌త్ అన్న రీతిలో త‌యారైన శ్రీ రామానుజాచార్యుల 216 అడుగుల భారీ విగ్ర‌హం.

ఇందులో భాగంగా ఈనెల 2న ప్రారంభ‌మ‌య్యాయి మ‌హోత్స‌వాలు. 14 దాకా ఈ కార్య‌క్ర‌మాలు నిరాటంకంగా కొన‌సాగుతూనే ఉంటాయి. ఇదే సంద‌రంలో తెలంగాణ‌కే త‌ల‌మానికంగా నిలిచిన స‌మతామూర్తి విగ్ర‌హాన్ని ప‌రిశీలించారు సీఎం కేసీఆర్.

ఆయ‌న ఉద్య‌మ నాయ‌కుడిగా, ప‌రిపాల‌నాద‌క్షుడిగానే కాదు భ‌క్తుడు కూడా. దేవాల‌యాల పున‌రుద్ద‌ర‌ణ‌కు శ్రీ‌కారం చుట్టారు. ఆల‌యాల అభివృద్ధికి కృషి చేస్తున్నారు.

ఈ సంద‌ర్భంగా ఇప్ప‌టికే తెలంగాణ రాష్ట్రం కొలువు తీరాక ఐటీ హ‌బ్ , ఫార్మా హ‌బ్ గా పేరొందింది. ప్ర‌స్తుతం ఆధ్యాత్మిక హ‌బ్ గా త‌యారు చేయాల‌న్న‌ది ఆయ‌న సంక‌ల్పం.

అందుకే శ్రీశ్రీ‌శ్రీ త్రిదండి రామానుజ చిన్న జీయ‌ర్ స్వామి(Chinnajeeyar) వారు చేప‌ట్టిన్ ఈ మ‌హ‌త్ కార్యానికి తాను కూడా ఓ చేయి వేశారు. ప్ర‌భుత్వం త‌ర‌పున స‌క‌ల ఏర్పాట్ల‌కు తోడ్పాటు అందించారు.

Also Read : మోదీ కోసం ‘స‌మ‌తామూర్తి’ సిద్ధం

Leave A Reply

Your Email Id will not be published!