Chirag Paswan : దమ్ముంటే స్వంతంగా పోటీ చేయ్
నితీశ్ కుమార్ పై చిరాగ్ పాశ్వాన్
Chirag Paswan : బీహార్ లో రాజకీయాలు మరింత వేడెక్కాయి. మరాఠా సీన్ ఇక్కడ రిపీట్ కానుందా అన్న అనుమానం వ్యక్తం అవుతోంది. నితీష్ కుమార్ , బీజేపీకి మధ్య దూరం పెరుగుతోంది.
ఈ తరుణంలో లోక్ జన్ శక్తి పార్టీ (రాం విలాస్ ) చీఫ్, ఎంపీ చిరాగ్ పాశ్వాన్ సంచలన కామెంట్స్ చేశాడు. దమ్ముంటే రాబోయే ఎన్నికల్లో నితీశ్ కుమార్ ఒంటరిగా పోటీ చేయాలని సవాల్ విసిరాడు.
రాష్ట్రంలో హూచ్ విషాదం కారణంగా 13 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆయా కుటుంబాలను పరామర్శించేందుకు బయలు దేరిన చిరాగ్ పాశ్వాన్(Chirag Paswan) సోమవారం మీడియాతో మాట్లాడారు.
2020లో నితీశ్ కుమార్ పై కుట్ర జరిగిందని జేడీయూ చీఫ్ రాజీవ్ రంజన్ అలియాస్ లాలన్ సింగ్ భావిస్తే ధైర్యం చేసి ఉండాల్సిందన్నారు. ఆ కుట్రకు పాల్పడిందెవరో బయటకు తెలిస్తే చెప్పాలన్నారు.
ఆనాడు తాను చెబితే వాస్తవం కాదన్నారని అన్నారు. ఈ సారి ఎన్నికల్లో జేడీయూ స్వంతంగా పోటీ చేసే సత్తా ఉందా అని ప్రశ్నించాడు చిరాగ్ పాశ్వాన్. ప్రతి దానికి చిరాగ్ మోడల్ గురించి మంచి పద్దతి కాదన్నాడు.
చిరాగ్ మోడల్ ప్రజల సెంటిమెంట్ కు ప్రతిబింబం తప్ప మరొకటి కాదన్నారు. దీనిని ఎవరు తయారు చేశారో ఎందుకు చెప్పడం లేదని నిలదీశారు చిరాగ్ పాశ్వాన్.
నితీశ్ కుమార్ తన అసమర్థతను కప్పి పుచ్చుకునేందుకు నాటకాలు ఆడుతున్నాడంటూ ఆరోపించారు. ఒకప్పుడు విలువల ప్రాతిపదికన రాజకీయాలు ఉండేవని కానీ ఇప్పుడు కుర్చీ వేదికగా రాజకీయాలు కొనసాగుతున్నాయన్నారు.
అతను జంగిల్ రాజ్ కి వ్యతిరేకంగా పవర్ లోకి వచ్చాడన్నారు. నితీశ్ కుమార్ చర్యలు ఎల్లప్పుడూ మాటలకు విరుద్దంగా ఉంటాయని ఎద్దేవా చేశాడు. కుర్చీకి ఇచ్చినంత విలువ సూత్రాలకు విలువ ఇవ్వడంటూ నిప్పులు చెరిగాడు చిరాగ్ పాశ్వాన్(Chirag Paswan).
Also Read : ముదిరిన వివాదం కూలనుందా ప్రభుత్వం