Chitra Ramakrishna : చిత్రా రామ‌కృష్ణ క‌స్ట‌డీ పొడిగింపు

14 రోజుల పాటు విచార‌ణ‌కు అప్ప‌గింత

Chitra Ramakrishna  : దేశ వ్యాప్తంగా సంచ‌ల‌న సృష్టించిన నేష‌న‌ల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ మాజీ చీఫ్ ఎగ్జిక్యూటీవ్ ఆఫీస‌ర్ చిత్ర రామ‌కృష్ణ‌కు (Chitra Ramakrishna ) కోలుకోలేని షాక్ త‌గిలింది. ఇప్ప‌టికే ఆమెతో పాటు ప‌లువురిని అదుపులోకి తీసుకుంది కేంద్ర ద‌ర్యాప్తు సంస్థ సీబీఐ.

తాజాగా ఆమెను కోర్టులో హాజ‌రు ప‌ర్చ‌డంతో కోర్టు 15 రోజుల క‌స్ట‌డీకి ప‌ర్మిష‌న్ ఇచ్చింది. ఆమె ముంద‌స్తు బెయిల్ ను కోర్టు ర‌ద్దు చేసింది. ఈనెల 6న సీబీఐ అరెస్ట్ చేసింది.

ఎన్ఎస్ఈ కోలొకేష‌న్ స్కామ్ కేసులో చిత్రా రామ‌కృష్ణ‌కు ఢిల్లీ కోర్టు సోమ‌వారం ఢిల్లీ కోర్టు 14 రోజుల జ్యుడిషియ‌ల్ క‌స్ట‌డీ విధించింది. చిత్రా రామ‌కృష్ణ త‌ప్పించుకునే స‌మాధానాలు ఇస్తోంద‌ని, విచార‌ణ‌కు స‌హ‌క‌రించ‌డం లేద‌ని సీబీఐ కోర్టుకు నివేదించింది.

ఇదిలా ఉండ‌గా జ్యుడిషియ‌ల్ క‌స్ట‌డీ స‌మ‌యంలో చిత్రా రామ‌కృష్ణ(Chitra Ramakrishna )ఇంట్లో వండిన ఆహారాన్ని తీసుకునేలా అవ‌కాశం ఇవ్వాల‌ని కోర్టుకు విన్న‌వించారు ఆమె త‌ర‌పు న్యాయ‌వాది. దీనిపై ప్ర‌ధాన న్యాయ‌మూర్తి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు.

ఇంట్లో నుంచి ఎందుకు జ్యూడిషియ‌ల్ క‌స్ట‌డీలో ఉన్న ఆహారం కూడా బాగానే ఉంటుంద‌ని స్ప‌ష్టం చేశారు. తాను కూడా చాలాసార్లు తిన‌డం జ‌రిగింద‌న్నారు.

ఆమె వీఐపీ అని, ఆమెకు మ‌రిన్ని సౌక‌ర్యాలు క‌ల్పించాల‌ని విన్న‌వించారు. దీనిపై సీరియ‌స్ అయ్యింది కోర్టు. చిత్రా రామ‌కృష్ణ వీఐపీ కాద‌ని కోర్టు ప‌రంగా ఎవ‌రైనా ఒక్క‌టేన‌ని స్ప‌ష్టం చేశారు.

అంద‌రి ఖైదీలంతా ఒక్క‌టేన‌ని పేర్కొన్నారు. ఆమెకు విధించిన ఏడు రోజుల క‌స్ట‌డి ఈరోజుతో ముగియ‌డంతో మ‌రోసారి సీబీఐ త‌మ‌కు అప్ప‌గించాల‌ని కోరింది.

Also Read : 60 ఏళ్లు దాటిన వారికి బూస్ట‌ర్ డోస్

Leave A Reply

Your Email Id will not be published!