Chitra Wagh : సంజ‌య్ రాథోడ్ పై చిత్ర కిషోర్ వాగ్ ఫైర్

క‌ల‌కలం రేపుతున్న గ‌త చ‌రిత్ర

Chitra Wagh : మ‌రాఠాలో షిండే వ‌ర్గం, బీజేపీ కూట‌మి ఏర్పాటైన 40 రోజుల త‌ర్వాత కొత్త‌గా కేబినెట్ కొలువు తీరింది. అప్ప‌టి వ‌ర‌కు ఉత్కంఠ రేగింది. మొత్తం 18 మంది ఎమ్మెల్యేల‌కు మంత్రి ప‌ద‌వులు ద‌క్కాయి.

షిండే వ‌ర్గం నుంచి 9 మందికి భార‌తీయ జ‌న‌తా పార్టీకి 9 మందికి చాన్స్ ద‌క్కింది. ఈ త‌రుణంలో తీవ్ర ఆరోప‌ణ‌లు ఎదుర్కొని, ఓ మ‌హిళ ఆత్మ‌హ‌త్య‌కు కార‌ణ‌మ‌య్యాడ‌న్న సంజ‌య్ రాథోడ్ కు కేబినెట్ లో చోటు ద‌క్క‌డంపై తీవ్ర విమ‌ర్శ‌లు ఎదుర‌వుతున్నాయి.

శివ‌సేన రెబ‌ల్ ఎమ్మెల్యేగా ఉన్నారు సంజ‌య్ రాథోడ్. మ‌హారాష్ట్ర లోని యావ‌త్క‌ల్ జిల్లా దిగ్రాస్ అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గానికి ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వ‌హిస్తున్నాడు.

ఇదిలా ఉండ‌గా షిండే క్యాంప్ లో ఓ కీల‌క ఎమ్మెల్యేగా ఉన్నాడు. కొత్త‌గా కొలువు తీరిన మంత్రివ‌ర్గంలో సంజ‌య్ రాథోడ్ కు చోటు ద‌క్క‌డంపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది బీజేపీ.

గ‌తంలో ఆయ‌న మంత్రిగా కూడా ప‌ని చేశారు. ఓ మ‌హిళ‌తో వివాహేత‌ర సంబంధం న‌డిపాడు. ఆమె సూసైడ్ కు కార‌కుడ‌య్యాడ‌నే ఆరోప‌ణ‌లున్నాయి. ఆనాడు అత‌డిపై చ‌ర్య తీసుకోవాల‌ని ఫైట్ చేసింది బీజేపీ.

కానీ అదే బీజేపీతో క‌లిసి ఇవాళ షిండే వ‌ర్గంతో కొత్త స‌ర్కార్ ఏర్పాటు చేసింది. తీవ్ర విమ‌ర్శ‌లు, ఆరోప‌ణ‌లు రావ‌డంతో ఆనాటి సీఎం ఉద్ద‌వ్ ఠాక్రే సంజ‌య్ రాథోడ్ రాజీనామా చేయించాడు.

ఈ సంద‌ర్భంగా బీజేపీ మ‌రాఠా ఉపాధ్య‌క్షురాలు చిత్ర(Chitra Wagh) స్పందించారు. ఓ మ‌రాఠా బిడ్డ‌ను పొట్ట‌న పెట్టుకున్న రాథోడ్ కు ఎలా మంత్రి ప‌ద‌వి ఇస్తారంటూ ప్ర‌శ్నించింది.

అత‌డికి వ్య‌తిరేకంగా పోరాటం కొన‌సాగుతుంద‌ని హెచ్చ‌రించారు. కాగా షిండే రాథోడ్ కు పోలీసులు క్లీన్ చిట్ ఇచ్చారంటూ చెప్పుకొచ్చాడు సీఎం షిండే.

Also Read : మ‌రాఠా మంత్రివ‌ర్గం చెరీ స‌మానం

Leave A Reply

Your Email Id will not be published!