CJI Chandrachud Governor System : సీజేఐ సీరియస్ కామెంట్స్
గవర్నర్లకు పాలిటిక్స్ ఎందుకు
CJI Chandrachud Governor System : కేంద్రంలో కొలువు తీరిన మోదీ ప్రభుత్వానికి కోలుకోలేని రీతిలో షాక్ ఇచ్చారు భారత దేశ సర్వోన్నత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధనంజయ వై చంద్రచూడ్. ఆయన ఇప్పటికే కీలకమైన తీర్పులు వెలువరించడంలో పేరు పొందారు. కొలీజియం వ్యవస్థపై కూడా సీరియస్ కామెంట్స్ చేశారు.
తాజాగా దేశంలో బీజేపీయేతర రాష్ట్రాలలో గవర్నర్లు వ్యవహరిస్తున్న తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. అంతే కాకుండా సంచలన వ్యాఖ్యలు చేయడం కలకలం రేపింది. గవర్నర్లకు రాజకీయాలతో సంబంధం ఏమిటి అని ప్రశ్నించారు. గవర్నర్లు రాజకీయాలలో జోక్యం చేసుకోకూడదని స్పష్టం చేశారు సీజేఐ(CJI Chandrachud Governor System).
ప్రభుత్వాల ఏర్పాటులో కీలక పాత్ర పోషించాల్సి ఉంటుంది. ఏమైనా సలహాలు, సూచనలు లేదా అభిప్రాయాలు వ్యక్తం చేసేందుకు ఓకే కానీ పూర్తిగా ఆధిపత్య ధోరణితో వ్యవహరిస్తామంటే కుదరదని స్పష్టం చేశారు సీజేఐ. గవర్నర్ల మితిమీరిన జోక్యం ప్రజాస్వామ్యానికి తీరని ప్రమాదం అని హెచ్చరించారు. ఇదిలా ఉండగా మరాఠాలో మహా వికాస్ అఘాడీని కూల్చి వేసి షిండే, బీజేపీ కలిసి సర్కార్ ను ఏర్పాటు చేశాయి.
ఈ వ్యవహారంలో గవర్నర్ పోషించిన పాత్రపై పిటిషన్ దాఖలైంది. దీనిపై సీజేఐ చంద్రచూడ్ , జస్టిస్ ఎంఆర్ షా, జస్టిస్ కృష్ణమురారి, జస్టిస్ హిమా కోహ్లీ, జస్టిస్ పీఎస్ నరసింహతో కూడిన ధర్మాసనం ఆసక్తికర వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ సందర్భంగా సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా చేసిన వాదనలపై అభ్యంతరం తెలిపారు సీజేఐ. గవర్నర్ ఎలా మాట్లాడతారంటూ ప్రశ్నించారు.
Also Read : తెలంగాణ బడుల్లో పంతుళ్లేరి – మురళి