CJI Comment : మానవీయ స్పర్శ లేకపోతే మనజాలం
చట్టానికి మానవత్వం అత్యంత అవసరం
CJI Comment : ఎప్పుడైతే భారత దేశ సర్వోన్నత ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ధనంజయ వై చంద్రచూడ్ కొలువు తీరారో ఆనాటి నుంచి ప్రతిరోజూ ఏదో ఒక అంశం చర్చకు దారితీస్తోంది. ఎక్కడా రాజీపడని మనస్తత్వం, వృత్తి పట్ల నిబద్దత, దేశం పట్ల , ప్రజల పట్ల తన బాధ్యతను కలిగి ఉండడాన్ని ఎక్కువగా ప్రేమించే స్వభావం కలిగి ఉన్నారు సీజేఐ.
ఆయన తరచూ న్యాయ వ్యవస్థ పట్ల, కేంద్రం వ్యవహరిస్తున్న తీరు పట్ల , వివిధ సందర్భాలలో వస్తున్న కేసులు, వెలిబుచ్చుతున్న అభిప్రాయాలు, ఇస్తున్న తీర్పులు ఆలోచింప చేసేలా చేస్తున్నాయి. ఒక రకంగా చెప్పాలంటే పాలకులకు కంటగింపుగా మారాయి.
దేశంలో గవర్నర్ల వ్యవస్థపై చేసిన వ్యాఖ్యలు, కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్ ను ఆగమేఘాల మీద కేంద్రం నియమించడాన్ని తీవ్రంగా తప్పు పట్టారు. ఇదే క్రమంలో సీల్డ్ కవర్లలో సమాధానాలు ఇవ్వడాన్ని తీసుకునే ప్రసక్తి లేదంటూ స్పష్టం చేశారు.
గౌహతి హైకోర్టు ప్లాటినం జూబ్లీ వేడుకల్లో పాల్గొన్న జస్టిస్ చంద్రచూడ్(CJI Comment) చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. చట్టంలో మానవత్వం ఉండాలి. ఎలప్పుడూ సున్నితత్వంతో ఉపయోగించాలని స్పష్టం చేశారు. ఇదే క్రమంలో చట్టాన్ని అమలు చేయాలని అనుకుంటున్న వర్గాల వాస్తవాలను పరిగణలోకి తీసుకోవాలని స్పష్టం చేశారు.
ప్రజలందరి ప్రయోజనాల కోసం చట్టం మానవీయ స్పర్శను కలిగి ఉండాలని సూచించారు. సమస్యల మూలాలను పరిష్కరించేందుకు చాలా జాగ్రత్త వహించాలని అన్నారు. చట్టాన్ని తెలివిగా అన్వయించినప్పుడు ప్రజలకు సామాజిక నిర్మాణంపై విశ్వాసం ఉంటుందని కుండ బద్దలు కొట్టారు. అది న్యాయానికి సంబంధించిన సాక్షాత్కారానికి ఒక ముందడుగుగా అభివర్ణించారు.
ఆపదలో ఉన్న పౌరులకు న్యాయ వ్యవస్థ భరోసా ఇస్తుందన్న నమ్మకాన్ని కలిగి ఉండాలన్నారు సీజేఐ. యావత్ చట్టం లేదా న్యాయ వ్యవస్థ మానవత్వం అనే స్పర్శతో నింపాలి. చట్టం అందరి ప్రయోజనాలకు ఉపయోగ పడుతుందని నిర్దారించేందుకు మానవ స్పర్శ అనేది చాలా అవసరమని నొక్కి వక్కాణించారు.
అంతే కాదు వైవిధ్యం పట్ల సానుభూతి, గౌరవం ఉండాలన్నారు జస్టిస్ చంద్రచూడ్(CJI Comment). కార్యనిర్వాహక, శాసనసభ, న్యాయ వ్యవస్థ దేశ నిర్మాణ ఉమ్మడి పనిలో నిమగ్నమై ఉన్నాయన్నారు.
రాజ్యాంగ బద్దమైన రాజనీతిజ్ఞతకు అన్నింటి కంటే చర్చలు, సంభాషణలు అత్యంత అవసరమని పేర్కొన్నారు. మొత్తంగా న్యాయ వ్యవస్థకు న్యాయమూర్తులు గుండె కాయ లాంటి వారని , ఆదర్శ ప్రాయంగా ఉండేలా తీర్పులు ఉండాలని స్పష్టం చేశారు సీజేఐ. మొత్తంగా మానవీయ స్పర్శ అన్నది లేక పోతే మనుగడ కష్టమని చెప్పకనే చెప్పారు.
Also Read : సీఆర్ రావుకు అంతర్జాతీయ అవార్డు