CR Rao Award : సీఆర్ రావుకు అంత‌ర్జాతీయ అవార్డు

గ‌ణాంకాల సిద్దాంతానికి అత్యుత్త‌మ పుర‌స్కారం

CR Rao Award : భార‌త దేశానికి చెందిన ప్ర‌ముఖ గ‌ణాంకాల నిపుణుడిగా పేరొందిన సీఆర్ రావుకు(CR Rao Award) అరుదైన గౌర‌వం ద‌క్కింది. కీల‌క‌మైన గ‌ణాంకాల సిద్దాంతాన్ని ప్ర‌తిపాదించినందుకు గాను అత్యుత్త‌మ అంత‌ర్జాతీయ అవార్డు ల‌భించింది. గ‌ణంకాల‌కు సంబంధించి 2023 సంవ‌త్స‌రానికిగ ఆను బ‌హుమ‌తి ద‌క్కింది. దీనిని త‌ర‌చుగా గ‌ణాంకాల నోబెల్ బ‌హుమ‌తిగా సూచిస్తారు.

ప్ర‌ముఖ భార‌తీయ అమెరిక‌న్ గ‌ణాంక నిపుణుడిగా కొన‌సాగుతున్నారు క‌ల్వంపూడి రాధాకృష్ణ రావు. ఆయ‌న‌ను అంతా సీఆర్ రావు అని పిలుచుకుంటారు. 75 ఏళ్ల కింద‌ట సైన్స్ పై తీవ్ర ప్ర‌భావం చూపుతున్న సీఆర్ రావుకు అంత‌ర్జాతీయ గ‌ణాంక బ‌హుమ‌తిని ప్ర‌క‌టించేందుకు సంతోషిస్తున్న‌ట్లు తెలిపారు అవార్డు నిర్వాహ‌కులు. ఈ మేర‌కు ఈ విష‌యాన్ని ఏప్రిల్ 3న ట్వీట్ చేసింది.

ఈ బ‌హుమ‌తిని ఐదు ప్ర‌ముఖ అంతర్జాతీయ గ‌ణాంకాల సంస్థ‌ల స‌హ‌కారంతో ద్వైవార్షిక ప్ర‌ధానం చేస్తారు. ఒక వ్య‌క్తి లేదా ఏదైనా టీం ద్వారా ఏదైనా సాధించిన దానిని గుర్తిస్తుంది సంస్థ‌. ఇక కెన‌డా లోని ఒట్టావాలో జ‌రిగే ద్వైవార్షిక ఇంట‌ర్నేష‌న‌ల్ స్టాటిస్టిక‌ల్ ఇన్ స్టిట్యూట్ వ‌ర‌ల్డ్ స్టాటిస్టిక్స్ కాంగ్రెస్ లో జూలై లో $80,000 అవార్డుతో వ‌చ్చే ఈ బ‌హుమ‌తిని క‌ల్వంపూడి రాధాకృష్ణా రావు(CR Rao Award) అందుకోనున్నారు.

1945లో క‌ల‌క‌త్తా మ్యాథ‌మెటిక‌ల్ సొసైటీ బులెటిన్ లో ప్ర‌చురించారు త‌న ప‌రిశోధనా ప‌త్రాన్ని సీఆర్ రావు. ఆధునిక గ‌ణాంకాల రంగానికి మార్గం సుగ‌మం చేశార‌ని సంస్థ కితాబు ఇచ్చింది.

Also Read : బొమ్మ‌న్ ..బెల్లీని క‌లిసిన మోదీ

Leave A Reply

Your Email Id will not be published!