CJI Justice Chandrachud : సీజేఐ షాకింగ్ కామెంట్స్
చట్టానికి కరుణ అవసరం
CJI Justice Chandrachud : న్యూఢిల్లీ – బారత దేశ సర్వోన్నత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధనంజయ వై చంద్రచూడ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చట్టం గురించి పదే పదే చర్చకు వస్తున్న తరుణంలో సీజేఐ తీవ్రంగా స్పందించడం ఒకింత విస్తు పోయేలా చేసింది.
ఓ కేసు సందర్బంగా చంద్రచూడ్ కీలక వ్యాఖ్యలు చేస్తూ చట్టాన్ని కరుణతో ఉపయోగించినప్పుడు అది న్యాయాన్ని ఉత్పత్తి చేయగలదని అన్నారు. అది ఏకపక్ష శక్తితో ప్రయోగించినప్పుడు అన్యాయం జరిగినట్లు అనిపిస్తుందన్నారు సీజేఐ.
CJI Justice Chandrachud Comment
దేశంలో సామాన్యుడికైనా లేదా ప్రధాని కైనా లేదా రాష్ట్ర పతి కైనా లేదా నాకైనా ఎవరికైనా ఒక్కటేనని గుర్తుంచు కోవాలని స్పష్టం చేశారు ధనంజయ వై చంద్రచూడ్(CJI Chandrachud). ఎవరు చట్టాన్ని వారి చేతుల్లోకి తీసుకుంటారనే దానిపై ఫలితాలు ఆధారపడి ఉంటాయన్నారు భారత దేశ సర్వోన్నత ప్రధాన న్యాయమూర్తి.
నా ప్రధాన ఉద్దేశం న్యాయమూర్తులు, న్యాయవాదులు మాత్రమే కాదని పౌర సమాజం కూడా గుర్తించాలని స్పష్టం చేశారు జస్టిస్ ధనంజయ వై చంద్రచూడ్.
Also Read : Rahul Gandhi : అమరులను అవమానిస్తే ఎలా