CJI Recuses : యెడియూరప్ప కేసు నుంచి తప్పుకున్న సీజేఐ
కీలక నిర్ణయం తీసుకున్న జస్లిస్ లలిత్
CJI Recuses : భారత దేశ సర్వోన్నత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ యుయు లలిత్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు కర్ణాటక మాజీ సీఎం బీఎస్ యెడియూరప్ప భూమికి సంబంధించి కేసును విచారించాల్సి ఉంది. అయితే ఉన్నట్టుండి తాను విచారించడం లేదంటూ పేర్కొన్నారు. ఈ అంశాన్ని దీపావళి తర్వాత తాను సభ్యుడు కాని సుప్రీంకోర్టు సరైన బెంచ్ ముందు జాబితా చేయాలని ఆదేశించారు.
ఇదిలా ఉండగా ఈ కేసుకు సంబంధించి జనవరి 27, 2021 బీఎస్ యెడియూరప్పకు అరెస్ట్ నుండి మధ్యంతర బెయిల్ ను కోర్టు మంజూరు చేసింది. కర్ణాటక రాష్ట్రంలోని భూమికి సంబంధించి కర్ణాటక హైకోర్టు ఇచ్చి న ఆదేశాలను సవాల్ చేస్తూ మాజ సీఎం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై విచారణ నుంచి భారత ప్రధాన న్యాయమూర్తి యుయు లలిత్(CJI Recuses) తప్పుకుంటున్నట్లు శుక్రవారం వెల్లడించారు.
ఈ మేరకు కీలక ప్రకటన చేయడం కలకలం రేపింది. ప్రస్తుతం న్యాయ వర్గాల్లో ఇది చర్చనీయాంశంగా మారింది. బీఎస్ యెడియూరప్ప, పరిశ్రమల శాఖ మాజీ మంత్రి మురుగేష్ ఆర్ నిరాణి, మరో నిందితుడిపై క్రిమినల్ కేసు ను పునరుద్దించింది హైకోర్టు.
జనవరి 5, 2021 నాటి కర్ణాటక హైకోర్టు జారీ చేసిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ దాఖలు చేసిన పిటిషన్ పై సుప్రీంకోర్టు విచారించంది. జనవరి 27, 2021న అరెస్ట్ చేయకుండా యాంటిసిపరీ బెయిల్ మంజూరు జారీ చేసింది.
కాగా 26 ఎకరాల భూమి కేటాయింపునకు హైలెవల్ క్లియరెన్స్ కమిటీ ఇచ్చిన ఆమోదాన్ని ఉపసంహరించు కోవాలని కోరుతూ పిటిషనర్ జారీ చేసిన నకిలీ పత్రాలు , నేర పూరిత కుట్రకు పాల్పడ్డారంటూ మాజీ సీఎం, ఇతరులపై ఆరోపణలు చేశారు. బెంగళూరు రూరల్ జిల్లా దేవనహల్లి ఇండస్ట్రియల్ ఏరియాలో ఎ. ఆలం పాషా అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు.
Also Read : దేశాభివృద్ధిలో ముస్లిం మహిళలు కీలకం