CJI NV Ramana : జిల్లా కోర్టు భ‌వ‌నాన్ని ప్రారంభించిన సీజేఐ

పాల్గొన్న గ‌వ‌ర్న‌ర్ విశ్వ భూష‌ణ్..సీఎం జ‌గ‌న్

CJI NV Ramana :  విజ‌య‌వాడ న‌గ‌రంలో నూత‌నంగా నిర్మించిన కోర్టు భ‌వ‌న స‌ముదాయాన్ని భార‌త దేశ స‌ర్వోన్న‌త ప్ర‌ధాన న్యాయ‌మూర్తి జ‌స్టిస్ నూత‌లపాటి వెంక‌ట ర‌మ‌ణ(CJI NV Ramana) శ‌నివారం ప్రారంభించారు.

రాష్ట్ర ప్ర‌భుత్వం త్వ‌రిత‌గ‌తిన భ‌వ‌న నిర్మాణం పూర్త‌య్యేందుకు చ‌ర్య‌లు చేప‌ట్టింది. ఈ కార్య‌క్ర‌మానికి హైకోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తి జ‌స్టిస్ ప్ర‌శాంత్ కుమార్ మిశ్రా, సీఎం వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి, ఇత‌ర న్యాయ‌మూర్తులు హాజ‌ర‌య్యారు.

ఇదిలా ఉండ‌గా సీజేఐ స్వ‌స్థ‌లం ఆంధ్ర‌ప్ర‌దేశ్. తెలుగు వాడైన ర‌మ‌ణ‌కు తెలుగు భాష అంటే వ‌ల్ల‌మాలిన అభిమానం. ప్ర‌ధాన న్యాయ‌మూర్తి త‌న కెరీర్ ను జ‌ర్న‌లిస్ట్ గా ప్రారంభించారు.

ఈనాడులో ప‌ని చేశారు. అనంత‌రం విజ‌యవాడ కోర్టులో లా కెరీర్ ను స్టార్ట్ చేశాడు. ఉమ్మ‌డి ఏపీ హైకోర్టులో ప‌ని చేశారు. ఢిల్లీ హైకోర్టుకు ప్ర‌ధాన న్యాయ‌మూర్తిగా ప‌ని చేశారు.

సుప్రీంకోర్టులో న్యాయ‌వాదిగా ప‌ని చేశారు. సీజేఐగా కొలువు తీరారు. ఆగ‌స్టు 26న ప‌ద‌వీ విర‌మ‌ణ చేయ‌నున్నారు. ఆయ‌న స్థానంలో జ‌స్టిస్ యుయు ల‌లిత్ సీజేఐగా ప్ర‌మాణ స్వీకారం చేస్తారు.

కేవ‌లం 74 రోజుల పాటు మాత్ర‌మే బాధ్య‌త‌లు చేప‌డ‌తారు. ఇదిలా ఉండ‌గా కోర్టు కాంప్లెక్స్ ఆవ‌ర‌ణ‌లో సీజేఐ ర‌మ‌ణ‌(CJI NV Ramana), సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిలు క‌లిసి మొక్క‌లు నాటారు.

కోర్టు భ‌వ‌న స‌ముదాయ ప్రారంభోత్స‌వం అనంత‌రం జ‌స్టిస్ ఎన్వీ ర‌మ‌ణ‌, ఆచార్య నాగార్జున విశ్వ విద్యాల‌యానికి చేరుకున్నారు. సీజేఐకి యూనివ‌ర్శిటీ డాక్ట‌రేట్ ను స్వీక‌రిస్తారు.

ఇదిలా ఉండ‌గా సీజేఐ ఎన్వీ ర‌మ‌ణ కీల‌క మార్పులు చేశారు న్యాయ వ్య‌వ‌స్థ‌లో.

Also Read : ఏపీలో గ్రామ‌..వార్డుల‌కు నిధుల వెల్లువ‌

Leave A Reply

Your Email Id will not be published!