Srisailam Bus Accident : శ్రీశైలం ఘాట్ రోడ్ లో తప్పిన ప్రమాదం
ఊపిరి పీల్చుకున్న 30 మంది ప్రయాణీకులు
Srisailam Bus Accident : మహబూబ్ నగర్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ప్రమాదం నుంచి బయట పడింది. శ్రీశైలం పుణ్య క్షేత్రం నుంచి 30 మంది ప్రయాణీకులతో మహబూబ్ నగర్ కు ప్రయాణిస్తున్న తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) కు చెందిన బస్సు ఉన్నట్టుండి శ్రీశైలం ఘాట్ రోడ్డు వద్ద ప్రమాదానికి(Srisailam Bus Accident) గురైంది.
డ్రైవర్ నిర్లక్ష్యమే దీనికి కారణమని తోస్తోంది. ప్రయాణీకులంతా క్షేమంగా బయట పడ్డారు. ఏ మాత్రం ఘాట్ రోడ్డుకు గనుక లేయర్స్ (కడ్డీలు) ఏర్పాటు చేయక పోయి ఉంటే భారీ ప్రమాదానికి గురయ్యేది ఆర్టీసీ బస్సు. శ్రీశైలంకు వెళుతూ ఘాట్ రోడ్డును ఢీకొట్టింది. దీంతో పెను ప్రమాదం నుంచి బయట పడింది.
ప్రయాణీకులంతా ఊపిరి పీల్చుకున్నారు. శ్రీశైలంలో కొలువు తీరిన మల్లికార్జున స్వామి (శివుడు) , పార్వతి ఆశీస్సులు ఉండడం వల్లనే బస్సు ప్రమాదం నుంచి బయట పడింది(Srisailam Bus Accident). ఈ ఘటన శ్రీశైలం డ్యాం దగ్గర ఘాట్ లో గోడను ఢీకొట్టింది. టర్నింగ్ వద్ద అదుపు తప్పింది బస్సు. గోడకు ఉన్న ఇనుప మేకులు బస్సు పడకుండా అడ్డుకున్నాయి.
దీంతో ప్రమాదం నుంచి బయట పడింది..ప్రయాణీకులు ఊపిరి పీల్చుకున్నారు. కాగా బస్సు వేగాన్ని డ్రైవర్ నియంత్రించ లేక పోవడం వల్లనే ఈ ఘటన చోటు చేసుకుందని సమాచారం. ఆ వెంటనే బస్సు నుంచి దూకేశారు ప్రయాణీకులు. బ్యారికేడ్ గనుక లేక పోతే బస్సు పూర్తిగా లోయలోకి పడి పోయేది. బస్సు ప్రమాదం గురించి ఆర్టీసీ ఉన్నతాధికారులు ఆరా తీశారు.
Also Read : ముందస్తు ఎన్నికలకు వెళ్లే దమ్ముందా