Uttarakhand Floods : దైవ భూమిని ముంచెత్తిన వ‌ర‌ద‌లు

ఎడ తెరిపి లేకుండా కురుస్తున్న వ‌ర్షాలు

Uttarakhand Floods : ఎడ తెరిపి లేకుండా కురుస్తున్న భారీ వ‌ర్షాల‌తో దైవ భూమిగా పేరొందిన ఉత్త‌రాఖండ్ అట్టుడుకుతోంది. ఓ వైపు హిమాచ‌ల్ ప్ర‌దేశ్ లో వ‌ర్షాలు దంచి కొడుతున్నాయి. వాగులు, వంక‌లు పొంగి పొర్లుతున్నాయి.

వ‌ర‌దల ధాటికి ఏకంగా రైల్వే భారీ వంతెన కూలి పోయింది. ఇక ఆక‌స్మిక వ‌ర‌ద‌ల దెబ్బ‌కు త‌ల్ల‌డిల్లుతోంది ఉత్త‌రాఖండ్(Uttarakhand Floods). మ‌రో వైపు ప్ర‌మాద‌క‌రంగా ప్ర‌వ‌హిస్తోంది సాంగ్ న‌ది.

ఈ న‌దిపై నిర్మించిన వంతెన పూర్తిగా కొట్టుకు పోయింది. ముస్సోరీ స‌మీపంలోని ప్ర‌ముఖ ప‌ర్యాట‌క ప్ర‌దేశం కెంప్టీ జ‌లపాతం ప్ర‌మాద‌క‌రంగా ప్ర‌వ‌హిస్తోంది.

అంతా అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని హెచ్చ‌రించారు సీఎం పుష్క‌ర్ సింగ్ ధామి. ట‌న్స్ న‌ది ఒడ్డున ఉన్న సుప్ర‌సిద్ధ శివాల‌యం త‌ప్కేశ్వ‌ర్ గుహ‌ల‌లోకి భారీగా నీరు ప్ర‌వ‌హిస్తోంది.

అది కూడా ప్ర‌మాద స్థాయిని దాటింది. డెహ్రాడూన్ జిల్లా లోని రాయ్ పూర్ – కుమ‌ల్డా ప్రాంతంలో శ‌నివారం తెల్ల వారు జామున మేఘాలు విస్పోట‌నం చెందాయి.

భారీగా వ‌ర‌దలు పొంగి పొర్లుతున్నాయ‌ని అంతా అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని సూచించారు సీఎం. భారీ వ‌ర‌ద‌ల తాకిడికి 12కు పైగా గ్రామాల్లోని ఇళ్ల‌లోకి బుర‌ద పెద్ద ఎత్తున ప్ర‌వేశించింది.

బాధిత ప్ర‌జ‌ల‌ను సుర‌క్షిత ప్రాంతాల‌కు త‌ర‌లించేందుకు రాష్ట్ర విప‌త్తు ప్ర‌తిస్పంద‌న ద‌ళం (ఎస్డీఆర్ఎఫ్‌) రంగంలోకి దిగింది. చిక్కుకున్న వారంద‌రినీ ర‌క్షించారు.

మ‌రికొంద‌రిని స‌మీపంలోని రిసార్ట్ లో ఆశ్ర‌యం క‌ల్పించార‌ని ప్ర‌భుత్వం వెల్ల‌డించింది. ఇదిలా ఉండ‌గా బాధితుల్ని పాఠ‌శాల‌లు, పంచాయ‌తీ భ‌వ‌నాల‌కు త‌ర‌లించిన‌ట్లు స‌బ్ డివిజ‌నల్ మేజిస్ట్రేట్ ల‌క్ష్మి రాజ్ చౌహాన్ వెల్ల‌డించారు.

Also Read : కాంగ్రాలో కూలిన రైల్వే వంతెన

Leave A Reply

Your Email Id will not be published!