Sonali Phogat : సోనాలీ కేసులో క్లబ్ ఓనర్..డ్రగ్ లీడర్ అరెస్ట్
కీలక విషయం వెల్లడించిన గోవా పోలీసులు
Sonali Phogat : హర్యానాకు చెందిన ప్రముఖ నటి, టిక్ టాక్ స్టార్, యాంకర్ , బీజేపీ నాయకురాలు సోనాలీ ఫోగట్ దారుణ హత్యకు గురయ్యారు. ఆమె తన స్నేహితులతో కలిసి గోవాకు వెళ్లారు.
అక్కడ మొదట గుండె నొప్పితో మృతి చెందారంటూ తెలిపారు. దీనిని తీవ్రంగా ఖండిచారు సోనాలీ ఫోగట్(Sonali Phogat) కుటుంబీకులు. దీంతో గోవా బీజేపీ ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది ఈ కేసును.
ఈ మేరకు ఆమెకు శవ పరీక్ష నిర్వహించి. ఈ పోస్టుమార్టం నివేదికలో సంచలన విషయాలు వెలుగు చూశాయి. ఆమె శరీరంపై బలమైన గాయాలు ఉన్నాయంటూ తేలింది.
దీంతో పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు ప్రారంభించారు. సోనాలీ ఫోగట్ సహాయకుడు, అతడి స్నేహితుడిని అదుపులోకి తీసుకున్నారు. విచారణ సందర్భంగా షాకింగ్ విషయం బయట పెట్టారు.
డ్రగ్స్ ఇచ్చి సోనాలీ ఫోగట్ ను అత్యాచారం చేసి, ఆపై హత్యకు పాల్పడ్డారని ఒప్పుకున్నారు. ఈ తరుణంలో తాజాగా మరో సంచలన ప్రకటన చేశారు పోలీసులు.
సోనాలీ ఫోగట్ హత్య కేసుకు సంబంధించి క్లబ్ యజమానితో పాటు డ్రగ్స్ సరఫరా చేసిన డీలర్ ను కూడా అరెస్ట్ చేశామని చెప్పారు. ఆమె ఇద్దరు సహచరులు బలవంతంగా నీళ్లల్లో ఏదో అసహ్యకరమైన పదార్థం కలిపి తాగించారని వెల్లడించారు.
గోవా రెస్టారెంట్ యజమానితో పాటు మరో ఇద్దరిని అరెస్ట్ చేశామన్నారు. దీంతో సోనాలీ ఫోగట్ హత్య కేసులో పురోగతి సాధించారు పోలీసులు.
ఈ కేసులో ఇద్దరు సహచరులు సుధీర్ సాంగ్వాన్ , సుఖ్ విందర్ సింగ్ సహా, రెస్టారెంట్ ఓనర్, డ్రగ్స్ డీలర్ తో కలిపి నలుగురిని అరెస్ట్ చేశారు.
Also Read : ఢిల్లీ ఖాకీలు వెన్నెముక లేనోళ్లు – మహూవా