Uttam Kumar Reddy : ప్రాజెక్టుల వివరాలు ఇవ్వండి
మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
Uttam Kumar Reddy : హైదరాబాద్ – కుంగిన మేడిగడ్డ ప్రాజెక్టుకు సంబంధించి పూర్తి వివరాలు వెంటనే ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో(Uttam Kumar Reddy) కలిసి ఆయన నీటి పారుదల శాఖపై సమీక్షించారు. ఈ సందర్బంగా కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే రాష్ట్రంలో అప్పులు పేరుకు పోయారని పేర్కొన్నారు. దీనిని గట్టెక్కించేందుకు నానా తంటాలు పడుతోంది సర్కార్.
Uttam Kumar Reddy Comment about Projects
ప్రధానంగా రూ. 1,20,000 కోట్లతో చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించినా ఎన్నికల సమయంలో మేడిగడ్డ పిల్లర్లు కుంగి పోయాయి. ఇది భారీ ఎత్తున విమర్శలకు దారి తీసేలా చేసింది. తాజాగా కుంగిన మేడిగడ్డ ప్రాజెక్టుకు సంబంధించి వెంటనే నివేదిక ఇవ్వాలని ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి.
రాష్ట్రంలో ప్రస్తుతం నీటి పారుదల రంగం పరిస్థితిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. గత ప్రభుత్వ హయాంలో కొత్తగా నిర్మించిన ప్రాజెక్టుల ఖర్చులకు సంబంధించి పూర్తి వివరాలు అందించాలన్నారు.
ఇతర రాష్ట్రాలతో జల వివాదాలకు సంబంధించి కృష్ణా ట్రిబ్యునల్ వద్ద వినిపించాల్సిన వాదనలు, ముందు ముందు ఇబ్బందులు తలెత్తకుండా తీసుకోవాల్సిన చర్యలపై సమావేశంలో చర్చించారు. యాసంగి పంటలకు నీళ్లిచ్చేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని సూచించారు.
నీటి లభ్యత, ఇతర అంశాలపై పలు సూచనలు చేశారు. అంతర్రాష్ట్ర జల వివాదాలను త్వరగా పరిష్కరించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు.
Also Read : Police Search : హైదరాబాద్ లో పబ్ లు..బార్లపై దాడులు