Arvind Kejriwal : ఇస్రో శాస్త్ర‌వేత్త‌ల కృషి భేష్

సీఎం అర‌వింద్ కేజ్రీవాల్

Arvind Kejriwal : ఇస్రో శాస్త్ర‌వేత్త‌ల కృషికి తాను సెల్యూట్ చేస్తున్నాన‌ని అన్నారు ఢిల్లీ సీఎం అర‌వింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal). చంద్రుడి ద‌క్షిణ ధృవాన్ని చేరుకున్న తొలి దేశంగా భార‌త్ నిలిచింద‌ని చెప్పారు. మ‌నం ఎవ‌రికీ త‌క్కువ కాద‌ని నిరూపించార‌ని కొనియాడారు. వారంద‌రికీ పేరు పేరునా అభినంద‌న‌లు తెలియ చేస్తున్నాన‌ని అన్నారు.

Arvind Kejriwal Salute to ISRO Scientist

ఇదే స‌మ‌యంలో కేంద్ర స‌ర్కార్ పై నిప్పులు చెరిగారు సీఎం. ప్ర‌తి ప‌నికి ఆటంకం క‌లిగించార‌ని ఆవేద‌న చెందారు. అయినా పేద‌ల‌కు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూశామ‌న్నారు. ప్ర‌తిసారీ అడ్డుకునే ప్ర‌య‌త్నం చేశారు. దీనిని స‌వాల్ చేస్తూ మేం భార‌త దేశ స‌ర్వోన్న‌త ప్ర‌ధాన న్యాయ స్థానాన్ని ఆశ్ర‌యించాం.

ఇదే స‌మ‌యంలో సుప్రీంకోర్టు కీల‌క‌మైన వ్యాఖ్య‌లు చేసింద‌న్నారు. కేంద్రానికి ఎలాంటి ప‌వ‌ర్స్ ఉండ‌వ‌ని స్ప‌ష్టం చేసింద‌న్నారు. అయినా ప‌ట్టుద‌ల‌కు పోయి ఢిల్లీపై ప‌ట్టు సాధించేందుకు ఆర్డినెన్స్ తీసుకు వ‌చ్చార‌ని ఆరోపించారు అర‌వింద్ కేజ్రీవాల్.

ఎన్ని అడ్డంకులు సృష్టించినా, ఇబ్బందులు క‌లిగించినా పేద‌లకు సౌక‌ర్యాలు నిలిపి వేసే ప్ర‌స‌క్తి లేద‌ని స్ప‌ష్టం చేశారు సీఎం. సుప్రీం తీర్పు ప‌ట్ల గౌర‌వం లేన‌టువంటి వాళ్ల‌కు ప్ర‌జాస్వామ్యం పై న‌మ్మ‌కం ఉంద‌ని తాను అనుకోవ‌డం లేద‌న్నారు సీఎం.

Also Read : Telangana Judge Suspend : మంత్రికి ఊర‌ట జ‌డ్జి స‌స్పెండ్

Leave A Reply

Your Email Id will not be published!