Ashok Gehlot PK : ఇండియన్ పొలిటికల్ స్ట్రాటజిస్ట్ అనూహ్యమైన నిర్ణయం తీసుకున్నారు. ఆయన గత కొన్ని రోజులుగా సుదీర్ఘ రాజకీయ చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీతో సమావేశం అవుతూ వస్తున్నారు.
ఇప్పటికే పలుమార్లు భేటీ అయ్యారు. ఆ పార్టీ భవిష్యత్ ముఖ చిత్రం మార్చేసేందుకు ప్రశాంత్ కిషోర్ బ్లూ ప్రింట్ కూడా ఇచ్చేశాడు. ఈ సందర్భంగా పీకేతో భేటీ అయిన వారిలో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మల్లికార్జున్ ఖర్గే, కేసీ వేణుగోపాల్, అంబికా సోనీ ఉన్నారు.
ఈ విషయాన్ని పార్టీ అధికార ప్రతినిధి ధ్రువీకరించారు కూడా. దేశంలో రాబోయే ఎన్నికల్లో ఆక్టోపస్ లా అల్లుకు పోయిన భారతీయ జనతా పార్టీని ఢీకొనాలంటే కనీసం పార్టీ ఒంటరిగా 370 సీట్లలో మిగతా నియోజకవర్గాలలో ఆయా ప్రాంతీయ పార్టీలతో సమన్వయం చేసుకోవాలని సూచించారు.
ఇందుకు సోనియా ఓకే కూడా చెప్పింది. ఇదే సమయంలో మేడంతో పాటు రాహుల్ గాంధీ పీకేను పార్టీలో చేరాలంటూ ఆహ్వానించారు. దీనికి పీకే కూడా ఓకే చెప్పేశాడు. దీనిపై స్పందించారు రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్(Ashok Gehlot PK ).
ఆయన ఫ్లవర్ కాదని ఫైర్ అంటూ కామెంట్ చేశారు. ఆయన చేరికతో కాంగ్రెస్ పార్టీ మరింత బలోపేతం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు సీఎం.
పీకే అనుభవం తమ పార్టీకి ఎంతగానో ఉపయోగ పడుతుందన్నారు. ఢిల్లీలో ఆయన సోనియా గాంధీని కలవనున్నారు. ఇదిలా ఉండగా పీకే ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్ , తమిళనాడులలో పని చేశారు. రెండింట్లోను గెలిపించి చూపించారు.
Also Read : డీఎంసీ సవరణ బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం