Bhagant Mann : పంజాబ్ సీఎంగా కొలువు తీరిన భగవంత్ మాన్ మొదటిసారి మంగళవారం మర్యాద పూర్వకంగా రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ను కలుసుకున్నారు.
ఈ సందర్భంగా ఎంపీ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొంది ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించిన భగవంత్ మాన్(Bhagant Mann) ను ప్రత్యేకంగా అభినందించారు రాష్ట్రపతి కోవింద్.
ఇదిలా ఉండగా భగవంత్ మాన్ మొదట కమెడియన్ గా తన కెరీర్ స్టార్ట్ చేశాడు. ఆ తర్వాత అనుకోకుండా పాలిటిక్స్ లోకి ఎంటర్ అయ్యాడు. ఎంపీగా గెలుపొందాడు.
ఆప్ లో కీలక మైన నాయకుడిగా ఎదిగారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఎంపీగా లోక్ సభలో ఎండగట్టాడు. ప్రజా సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
ఇదే సమయంలో రైతులు చేస్తున్న ఉద్యమానికి మద్దతు పలికాడు. సెటైరిక్ గా మాట్లాడటంలో ఆయనకు ఆయనే సాటి. ఇక ఈసారి దేశంలోని ఐదు రాష్ట్రాలలో జరిగిన ఎన్నికల్లో 117 సీట్లకు గాను ఆమ్ ఆద్మీ పార్టీ కి 92 సీట్లు వచ్చాయి.
ఆప్ విజయంంలో భగవంత్ మాన్(Bhagant Mann) ముఖ్యమైన పాత్రను పోషించాడు. ఎన్నికలకంటే ముందే ఆప్ జాతీయ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పంజాబ్ కు ఎవరు సీఎంగా ఉండాలో పోల్ నిర్వహించారు.
ఇందులో 90 శాతానికి పైగా తమకు భగవంత్ మాన్ కావాలని కోరారు. ఆయనను పంజాబీలు ముద్దుగా జుగ్నుగా పిలుచుకుంటారు. ఇక భగవంత్ మాన్ కు సర్దార్ షహీద్ భగత్ సింగ్ అంటే వల్లమాలిన అభిమానం.
అందుకే తన ప్రమాణ స్వీకారాన్ని రాజ్ భవన్ లో కాకుండా కొంగర్ కలాన్ లో నిర్వహించారు.
Also Read : ఆహార నిల్వల సరఫరాకు ఇండియా రెడీ