CM Biren Singh : మణిపూర్ లో హింసకు కాంగ్రెస్ కారణం
ఆ రాష్ట్ర సీఎం బీరేన్ సింగ్ షాకింగ్ కామెంట్స్
CM Biren Singh : మణిపూర్ రాష్ట్ర ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన కాంగ్రెస్ పార్టీపై నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో చోటు చేసుకున్న హింసకు, అల్లర్లకు ఆ పార్టీనే కారణమని ఆరోపించారు. తనకు కానీ, ప్రధాని మోదీకి కానీ, అమిత్ షాకు కానీ సంబంధం లేదన్నారు.
CM Biren Singh Slams Congress
రాహుల్ గాంధీ లడఖ్ పర్యటనలో ఉన్న సమయంలో మణిపూర్ గురించి ఎందుకు మాట్లాడుతున్నారంటూ సీఎం బీరేన్ సింగ్(CM Biren Singh) ప్రశ్నించారు. ఇది మంచి పద్దతి కాదన్నారు. కాంగ్రెస్ పార్టీ రెచ్చగొట్టడం వల్లనే ఇవాళ రాష్ట్రంలో హింసోన్మాదం చోటు చేసుకుందని మండిపడ్డారు. అయినా తాము అల్లర్లను, హింస చోటు చేసుకోకుండా కంట్రోల్ చేస్తున్నామని చెప్పారు.
ఇందుకు సంబంధించి ఎప్పటికప్పుడు ప్రధానిని, హోం శాఖ మంత్రితో సలహాలు, సూచనలు తీసుకుంటున్నానని, సహాయం పొందుతున్నామని అన్నారు. శుక్రవారం బీరేన్ సింగ్ మీడియాతో మాట్లాడారు.
కాంగ్రెస్ పార్టీ చిల్లర రాజకీయాలు చేయడం మాను కోవాలని హితవు పలికారు. ఇలాంటి చౌకబారు ప్రకటనల వల్ల ప్రజల్లో లేనిపోని అపోహలు కలుగుతాయని అన్నారు. రాహుల్ గాంధీ తన స్థాయికి మించి మాట్లాడుతున్నారని ఆయనకు అంత సీన్ లేదన్నారు సీఎం.
Also Read : Donald Trump : డొనాల్డ్ ట్రంప్ అరెస్ట్..రిలీజ్