CM Bommai : ఈశ్వ‌ర‌ప్ప‌కు సీఎం బొమ్మై అభ‌యం

విచార‌ణ పూర్త‌య్యాక చ‌ర్య‌లు

CM Bommai : క‌ర్ణాట‌క‌లో కాంట్రాక్ట‌ర్ సూసైడ్ కేసులో తీవ్ర ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న రాష్ట్ర గ్రామీణాభివృద్ది, పంచాయ‌తీరాజ్ శాఖ మంత్రి కేఎస్ ఈశ్వ‌ర‌ప్ప‌ను వెన‌కేసుకు వ‌చ్చే ప్ర‌య‌త్నం చేశారు ముఖ్య‌మంత్రి బ‌స‌వ‌రాజ్ బొమ్మై(CM Bommai).

ఆయ‌న త‌న కేబినెట్ లో కొన‌సాగుతారంటూ స్ప‌ష్టం చేశారు. పోస్ట్ మార్టం పూర్త‌యింది. ప్రాథ‌మిక విచార‌ణ ప్రారంభించ‌నీయండి. ప్రాథ‌మిక అంశాల‌ను బ‌ట్టి త‌ద‌రుప‌రి చ‌ర్య‌లు తీసుకునే విష‌యం ఆలోచిస్తామ‌న్నారు సీఎం.

సంతోష్ పాటిల్ రూ. 4 కోట్ల విలువ ప‌నులు చేశారు. ఇందులో 40 శాతం మంత్రితో పాటు అనుచ‌రులు క‌మీష‌న్ ఇవ్వాల‌ని డిమాండ్ చేశారంటూ ఆరోపించాడు. దీనిని త‌ట్టుకోలేకే తాను సూసైడ్ చేసుకుంటున్నానంటూ మంగ‌ళ‌వారం రాసిన నోట్ లో పేర్కొన్నాడు.

ఇది రాష్ట్ర వ్యాప్తంగా క‌ల‌క‌లం రేగింది. ఇక మృతుడు సంతోష్ పాటిల్ సోద‌రుడు చేసిన ఫిర్యాదు మేర‌కు పోలీసులు మంత్రి ఈశ్వ‌రప్ప‌తో పాటు అనుచ‌రుల‌పై ఎఫ్ఐఆర్ న‌మోదు చేశారు.

ఇవాళ బెంగ‌ళూరులో క‌ర్ణాట‌క పీసీసీ చీఫ్ డీకే శివ‌కుమార్ ఆధ్వ‌ర్యంలో పెద్ద ఎత్తున ఆందోళ‌న చేప‌ట్టారు. కాంట్రాక్ట‌ర్ ఆత్మ‌హ‌త్య‌కు కార‌కుడైన మంత్రి ఈశ్వ‌ర‌ప్ప‌ను వెంట‌నే తొల‌గించాల‌ని డిమాండ్ చేశారు.

ఈ త‌రుణంలో సీఎం బొమ్మై(CM Bommai) స్పందించారు. ఇదిలా ఉండగా ఈశ్వ‌ర‌ప్ప‌ను తొల‌గించాలంటూ హైక‌మాండ్ నుంచి ఏమైనా ఒత్తిడి ఉందా అన్న ప్ర‌శ్న‌కు అలాంటిది ఏమీ లేద‌న్నారు.

పూర్తి ప్రాథ‌మిక విచార‌ణ జ‌రిగాకే ఆలోచిస్తామ‌న్నారు సీఎం బస‌వ‌రాజ్ బొమ్మై. ఇదిలా ఉండ‌గా విప‌క్షాలు కోరితే తాను ఎలా రాజీనామా చేస్తానంటూ ఎదురు ప్ర‌శ్న వేశారు మంత్రి ఈశ్వ‌ర‌ప్ప‌. వ‌ర్క్ ఆర్డ‌ర్ లేకుండా డబ్బులు ఎలా ఇస్తామ‌ని అన్నారు.

Also Read : ఈశ్వ‌ర‌ప్ప రాజీనామా చేయాలి- డీకేఎస్

Leave A Reply

Your Email Id will not be published!