Priyank Kharge Bommai : ఫాక్స్ కాన్ ఒప్పందం అబద్దం
ప్రజల్ని మోసం చేస్తున్న సీఎం
Priyank Kharge Bommai : కర్ణాటకలో ఎన్నికల వేడి మరింత ముదిరింది. ఒకరిపై మరొకరు ఆరోపణల పర్వానికి శ్రీకారం చుట్టారు. కారాలు మిరియాలు నూరుతున్నారు. కేంద్ర ఐటీ శాఖ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ , కర్ణాటక సీఎం బస్వరాజ్ బొమ్మై(CM Bommai) కలిసి కీలక ప్రకటన చేశారు. ఫాక్స్ కాన్ ఫోన్ల తయారీ కంపెనీ కర్ణాటకలో ఐఫోన్లను తయారు చేస్తుందని వెల్లడించారు. ఇందుకోసం కర్ణాటక పక్కనే ఉన్న 300 ఎకరాలను సదరు ఫోన్ల తయారీ కంపెనీకి ఇస్తున్నట్లు తెలిపారు.
దీని ద్వారా లక్ష మందికి పైగా ఉపాధి లభిస్తుందని ప్రచారం చేపట్టారు. దీని గురించి సీఎం ట్వీట్ కూడా చేశారు. ఈ మొత్తం వ్యవహారంపై కర్ణాటక కాంగ్రెస్ పార్టీ నిలదీసింది. ఇదంతా ప్రచారం కోసం చేస్తున్నది తప్ప అంతా అబద్దమని, ప్రజలను ఓట్ల కోసం మోసం చేస్తున్నారంటూ ఆరోపించింది. ఫాక్స్ కాన్ ఇప్పటి వరకు కర్ణాటక ప్రభుత్వంతో ఎలాంటి ఒప్పందం చేసుకోలేదని ప్రకటించిందని తెలిపింది. ఎవరిని ప్రజలు నమ్మాలో చెప్పాలని నిలదీసింది. ఇలా ఎంత కాలం ప్రజలను తప్పు దోవ పట్టిస్తారంటూ బొమ్మని కడిగి పారేసింది కాంగ్రెస్.
ఇంత ప్రతిష్టాత్మకమైన పెట్టుబడిని సీఎం ఎందుకు ప్రమాదంలో పడేయాలని అనుకుంటున్నారంటూ ప్రశ్నించారు కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమటీ అధికార ప్రతినిధి ప్రియాంక్ ఖర్గే(Priyank Kharge Bommai). ఇదిలా ఉండగా ఫిబ్రవరి 27 నుంచి మార్చి 4 వరకు ఫాక్స్ కాన్ చైర్మన్ , సిఇఓ యంగ్ లియు భారత పర్యటన సందర్భంగా ఎలాంటి ఒప్పందాలు ఖరారు కాలేదని స్పష్టం చేశారు. ఇదే విషయంపై క్లారిటి ఇవ్వాలని కోరారు ఖర్గే.
Also Read : పీయూసీ పరీక్షలో హిజాబ్ ఒప్పుకోం