CM Bommai : కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మై సంచలన కామెంట్స్ చేశారు. త్వరలో రాష్ట్రంలో 2023లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. కేబినెట్ పునర్ వ్యవస్థీకరించనున్నట్లు సూచన ప్రాయంగా తెలిపారు.
ఏప్రిల్ 6న దేశ రాజధానిలో భారతీయ జనతా పార్టీ చీఫ్ జేపీ నడ్డా తో సమావేశం అయ్యారు. ఇదిలా ఉండగా కర్ణాటకలో పర్యటించిన నడ్డాకు స్వాగతం పలికారు సీఎం.
ఈ సందర్భంగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అధికార పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు. అసెంబ్లీ ఎన్నికలకు ఎన్నికల శంఖారావాన్ని వినిపించారు.
మంత్రివర్గ విస్తరణ లేదా పునర్ వ్యవస్థీకరణపై పార్టీ హైకమాండ్ త్వరలో నిర్ణయం తీసుకుంటుందని సీఎం బసవరాజ్ బొమ్మై(CM Bommai )వెల్లడించారు. సోమవారం ఈ విషయాన్ని ప్రకటించారు.
అవినీతి ఆరోపణలపై రాష్ట్ర మంత్రివర్గం నుంచి కేఎస్ ఈశ్వరప్ప నిష్క్రమించడం, కాంట్రాక్టర్ ఆత్మహత్య కేసులో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వమే భారతీయ జనతా పార్టీకి గొప్ప బలమని బొమ్మై (CM Bommai ) చెప్పారు.
రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సుపరిపాలన కోసం రైతులు, మహిళలు , బలహీనవర్గాల నుంచి పార్టీ సానుకూల ఆదేశాన్ని కోరుకుంటుందన్నారు.
ప్రధాని మోదీ నాయకత్వంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు మన పార్టీని కర్ణాటకలో గెలిపిస్తారంటూ ధీమా వ్యక్తం చేశారు సీఎం బసవరాజ్ బొమ్మై.
తమ పనితీరుతో ప్రజల వద్దకు వెళతామని ప్రకటించారు. అన్ని వర్గాల ప్రజలు తమ వైపు ఉన్నారంటూ తెలిపారు. కలిసకట్టుగా సాగితే విజయం తమదేనని పేర్కొన్నారు. అవినీతి, అక్రమాల గురించి మాట్లాడే నైతిక హక్కు కాంగ్రెస్ పార్టీకి లేదన్నారు సీఎం బొమ్మై.
Also Read : సుప్రీంకోర్టు తీర్పుపై తికాయత్ కామెంట్