CM Bommai : మఠాధిపతి లైంగిక కేసులో నో కామెంట్
విచారణ జరుగుతోందన్న కర్ణాటక సీఎం
CM Bommai : కర్ణాటక సీఎం బస్వరాజ్ బొమ్మై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కర్ణాటక రాష్ట్రంలోని చిత్రదుర్గలో పేరొందిన ఓ మఠాధిపతి లైంగిక కేసు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.
ఈ కేసుకు సంబంధించి విచారణ కొనసాగుతోందని దీనిపై తాను వ్యాఖ్యానించడం లేదా అభిప్రాయం చెప్పడం మంచి పద్దతి కాదన్నారు సీఎం. ప్రస్తుతం ఆరోపణలు మాత్రమే ఉన్నాయి.
ఈ సమయంలో కామెంట్స్ చేయడం వల్ల కేసు పురోగతిపై ప్రభావం చూపుతుందన్నారు బొమ్మై(CM Bommai). విచారణలో వాస్తవాలు వెలుగు చూస్తాయని స్పష్టం చేశారు.
ఇదిలా ఉండగా బాలల లైంగిక నేరాల నుంచి రక్షణ (పోక్సో) చట్టం కింద అభియోగాలు మోపిన చిత్ర దుర్గ లోని ప్రముఖ మఠాధిపతికి సంబంధించిన కేసులో దర్యాప్తు కొనసాగుతోందని చెప్పారు సీఎం.
సమయంలో తాను ఎలాంటి ఆన్సర్ ఇవ్వలేనన్నారు. పోక్సో చట్టం కింద ఇప్పటికే కేసు నమోదు చేశారని తెలిపారు. చిత్రదుర్గలో కిడ్నాప్ చేసిన కేసు కూడా ఉందన్నారు సీఎం.
ఇందుకు సంబంధించి పోలీసులు రెండు కేసులు నమోదు చేశారన్నారు. కేసును అర్థం చేసుకోవాలే తప్పా విచారణకు మంచిది కాదన్నారు. బెంగళూరులో బస్వరాజ్ బొమ్మై(CM Bommai) మీడియాతో మాట్లాడారు.
తాము ఎలాంటి జోక్యం చేసుకునే ప్రసక్తి లేదన్నారు. పోలీసులకు పూర్తి స్వేచ్ఛ ఇవ్వడం జరిగిందన్నారు. విచారణ కొనసాగుతూ వస్తోందన్నారు.
కాగా హైస్కూల్ బాలికలపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారనే ఆరోపణలపై మైసూరు సిటీ పోలీసులు కేసు నమోదు చేశారు.
చిత్రదుర్గ లోని మురగ మఠానికి చెందిన శివమూర్తి మురుగ శరణారావుపై పోక్సో చట్టం కింద , భారత శిక్షాస్మృతి లోని కొన్ని సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. మఠం హాస్టల్ వార్డెన్ సహా ఐదుగురికి కేసు నమోదు చేశారు.
Also Read : ఎన్వీ రమణపై ఒమర్ అబ్దుల్లా ఫైర్