CM Break Fast Scheme : రేపే సీఎం అల్పాహారం స్కీం స్టార్ట్
వెల్లడించిన మంత్రి సబితా రెడ్డి
CM Break Fast Scheme : తెలంగాణ – రాష్ట్రంలో కొలువు తీరిన బీఆర్ఎస్ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కొత్త స్కీంకు శ్రీకారం చుట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ బడుల్లో చదువుకుంటున్న నిరుపేద విద్యార్థులకు పౌష్టికాహారం అందించాలని నిర్ణయించింది. చదువుపై దృష్టి పెట్టేందుకు మరో ప్రతిష్టాత్మక కార్యక్రమానికి ఓకే చెప్పింది. ఈ మేరకు సీఎం కేసీఆర్(CM KCR) అన్ని జిల్లాలో అమలు చేయాలని ఆదేశించారు. ఈ మేరకు సీఎస్ జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ఏర్పాటు చేశారు.
CM Break Fast Scheme in Telangana Govt Schools
ఈనెల 6న శుక్రవారం సీఎం బ్రేక్ ఫాస్ట్ పథకం (అల్పహారం) ప్రారంభించనుంది ప్రభుత్వం. తెలంగాణలోని 27 వేల 147 ప్రభుత్వ బడుల్లో 23 లక్షల మంది విద్యార్థులకు లబ్ది చేకూరనుందని పేర్కొంది సర్కార్. ఈ మేరకు వారంలో ఏమేం ఇస్తారనే దానిపై క్లారిటీ ఇచ్చింది ప్రభుత్వం.
బ్రేక్ ఫాస్ట్ స్కీంలో భాగంగా సోమవారం ఇడ్లి సాంబార్ లేదా గోధుమ రవ్వ ఉప్మా, చట్నీ ఇస్తారు. ఇక మంగళవారం పూరి, ఆలు కుర్మా లేదా టమాటా బాత్ రవ్వ, చట్నీ అందిస్తారు. బుధవారం రోజు ఉప్మా, సాంబార్ లేదా కిచిడి, చట్టీ ఉంటుంది. గురువారం రోజు మిల్లెట్ ఇడ్లీ, సాంబార్ లేదా పొంగగల్ , సాంబార్ ఇస్తారు. శుక్రవారం ఉగ్రాణి , పోహా, మిల్లెట్ ఇడ్లీ, చట్నీ , గోధుమ రవ్వ కిచిడీ, చట్నీ ఉంటుంది. శనివారం రోజు పొంగల్ , సాంబార్ లేదా కూరగాయల పొలావ్ , రైతా, ఆలు కుర్మ ఇస్తారని ప్రభుత్వం తెలిపింది.
Also Read : Chandra Babu Naidu : బాబుకు షాక్ రిమాండ్ పొడిగింపు
