CM Chandrababu: పీ-4 మార్గదర్శుల పేరుతో ఎవరినీ బలవంతం పెట్టవద్దు – సీఎం చంద్రబాబు
పీ-4 మార్గదర్శుల పేరుతో ఎవరినీ బలవంతం పెట్టవద్దు - సీఎం చంద్రబాబు
CM Chandrababu : పేదరిక నిర్మూలనకు రాష్ట్రంలో చేపట్టిన పీ-4 కార్యక్రమం దేశానికి ఆదర్శంగా నిలుస్తుందని ఏపీ సీఎం చంద్రబాబు (CM Chandrababu) అన్నారు. బంగారు కుటుంబాలకు మెరుగైన జీవన ప్రమాణాలే లక్ష్యమని చెప్పారు. సచివాలయంలో పీ-4 కార్యక్రమంపై మంత్రి పయ్యావుల కేశవ్, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సీఎం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పీ-4 కార్యక్రమాన్ని ఈ నెల 19 నుంచి అమలు చేయాలని నిర్ణయించినట్లు సీఎం తెలిపారు. మార్గదర్శుల ఎంపికలో ఎక్కడా వ్యతిరేకత రాకూడదన్నారు.
CM Chandrababu Key Comments on P4
‘‘మార్గదర్శుల నుంచి చిన్న ఆసరా పేదలకు కొండంత అండ అవుతుంది. బంగారు కుటుంబాలకు కావాల్సింది భావోద్వేగాలతో కూడిన బంధం, చేయూత మాత్రమే. సీఎస్ఆర్ నిధులతో బిల్ గేట్స్‌తో పాటు వేదాంత లాంటి సంస్థలు పనిచేస్తున్నాయి. వీటికి మించి కుటుంబాలను ఆదుకోవడటమే లక్ష్యంగా పీ-4 కార్యక్రమం చేపట్టాం. ప్రజలే ఆస్తిగా జీరో పావర్టీ మిషన్ అమలు చేస్తున్నాం. బంగారు కుటుంబాలను ఆదుకోవడంలో మార్గదర్శుల ఎంపిక పూర్తిగా స్వచ్ఛందంగానే జరుగుతుంది. ఎక్కడా ఎవరినీ బలవంతం చేయవద్దు అని సూచించారు.
మంచి కార్యక్రమాలు అడ్డుకునేందుకు కొందరు ప్రయత్నిస్తారు. ప్రజల్లో దీనిపై వ్యతిరేకత తెచ్చేందుకు ప్రయత్నాలు చేస్తారు. గతంలో జన్మభూమి, శ్రమదానం ఇలా ఏ కార్యక్రమం చేపట్టినా ఇదే విధంగా విమర్శించారు. కొందరికి ఆర్థిక వనరులున్నా పేదల్ని ఆదుకోవడానికి మనసు రాదు. కొందరికి మనసు ఉన్నా సమయం ఉండకపోవచ్చు. అలాంటి వారిని గుర్తించాలి. ఇవాళ బంగారు కుటుంబంలో సాయం పొందిన వారే… రేపు మార్గదర్శి అవ్వొచ్చు. ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ పథకాలు అందుకుంటూనే బంగారు కుటుంబాలకు పీ-4 ద్వారా అదనపు సాయం అందుతుంది. విదేశాల్లో ఉన్న ఎన్ఆర్ఐలు, పారిశ్రామిక వేత్తలను కలిసి వారిలో ఆలోచనలు రేకెత్తించాలి.
ఇప్పటి వరకు 9,37,913 బంగారు కుటుంబాల ఎంపిక పూర్తయింది. 1,03,938 మందిని మార్గదర్శులుగా గుర్తించాం. రాష్ట్రవ్యాప్తంగా 10లక్షల కుటుంబాలకు ఉన్న అవసరాలను ప్రాధాన్యత క్రమంలో గుర్తించాం. 11 ప్రశ్నలతో వివరాలు నమోదు చేసి ఏఐతో విశ్లేషించాం. 31 శాతం మంది ఉద్యోగ అవకాశాలు కల్పించాలని, 22 శాతం మంది వైద్య చికిత్సలకు సంబంధించి, 9 శాతం మంది తమ చిన్న చిన్న వ్యాపారాలను మరింత పెంచుకోవడానికి అవకాశం కల్పించాలని కోరారు. బంగారు కుటుంబాలను దత్తత తీసుకోవడంతోపాటు గ్రామాలు, మండలాల వారీగా దత్తత తీసుకునేందుకు కొందరు ముందుకొస్తున్నారు. నేను 250 కుటుంబాలను దత్తత తీసుకోవడంతోపాటు ఎన్టీఆర్ ట్రస్టు ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు అమలు చేస్తున్నాం’’అని సీఎం చంద్రబాబు (CM Chandrababu) తెలిపారు.
Also Read : Komatireddy Venkat Reddy: తెలంగాణా రాజకీయాల్లో సంచలనంగా మారి కోమటిరెడ్డి బద్రర్స్ వ్యాఖ్యలు
