CM Chandrababu: విశాఖలో డబుల్ డెక్కర్ బస్సులను ప్రారంభించిన సీఎం చంద్రబాబు
విశాఖలో డబుల్ డెక్కర్ బస్సులను ప్రారంభించిన సీఎం చంద్రబాబు
CM Chandrababu : విశాఖలో పర్యాటక రంగ అభివృద్ధికి ఏపీ పర్యాటక శాఖ ప్రవేశపెట్టిన హాప్ ఆన్ హాప్ ఆఫ్ డబుల్ డెక్కర్ బస్సులను బీచ్ రోడ్ లో సీఎం చంద్రబాబు (CM Chandrababu) జెండా ఊపి ప్రారంభించారు. ఈ హాప్ ఆన్ హాప్ ఆఫ్ డబుల్ డెక్కర్ బస్సులు ఆర్కే బీచ్ నుంచి తొట్ల కొండ వరకూ బీచ్ రోడ్ లో ప్రయాణించనున్నాయి. మొత్తం 16 కిలోమీటర్ల మేర పర్యాటక ప్రాంతాల్లో తిరగనున్న ఎలక్ట్రిక్ డబుల్ డెక్కర్ బస్సులల్లో స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి సీఎం చంద్రబాబు ప్రయాణించారు.
CM Chandrababu Starts
ఈ సందర్భంగా బీచ్ రోడ్ లో పర్యాటకులకు అభివాదం చేస్తూ డబుల్ డెక్కర్ పర్యాటక బస్సులో ప్రయాణించారు. అనంతరం సీఎం చంద్రబాబు మాట్లాడుతూ… 24 గంటల పాటు ప్రయాణించేలా టికెట్ ఛార్జీని రూ.500 పెట్టారు. అయితే పర్యాటకుల సౌలభ్యం కోసం సగం మొత్తాన్ని ప్రభుత్వం భరిస్తుంది. రూ.250 రూపాయలకే 24 గంటల పాటు టికెట్టును వర్తింప చేసేలా ఆదేశాలు ఇస్తున్నాం. పర్యాటకులంతా పర్యావరణ హితంగా వ్యవహరించాలి. మన తీరప్రాంతాలు పరిశుభ్రంగా ఉండాలి. ప్రపంచ పర్యాటకుల్ని ఆకర్షించేలా ఈ బీచ్ లు నిర్వహించేందుకు పౌరులు సహకరించాలి.
విశాఖ ఆర్ధిక రాజధానిగా, ఆసియా టెక్నాలజీ హబ్ గా ఎదగబోతోంది. విశాఖలో డేటా సెంటర్, సీ కేబుల్ వేస్తారు. ఈ కేబుల్ ద్వారా విశాఖతో మిగతా ప్రపంచం అనుసంధానం అవుతుంది. భారత్ కే టెక్నాలజీ హబ్ గా విశాఖ ఎదుగుతుంది. మహిళలకు సురక్షితమైన నగరంగా విశాఖ ఎంపికైంది. ఢిల్లీ, ముంబై, బెంగుళూరు, చెన్నై నగరాలతో పోటీ పడుతోంది. విశాఖ మహిళలకు సురక్షిత చిరునామాగా మారింది.. ఇది మనం అంతా గర్వపడే అంశం అని అన్నారు.
CM Chandrababu – మహిళలకు సురక్షిత నగరంగా విశాఖ
మహిళలకు సురక్షిత నగరంగా విశాఖ ఎంపిక కావడం రాష్ట్ర ప్రజలందరికీ గర్వకారణమని సీఎం తెలిపారు. ఢిల్లీ, ముంబై, బెంగళూరు, చెన్నై వంటి మెట్రో నగరాలతో పోటీ పడుతూ విశాఖ మహిళలకు సురక్షిత చిరునామాగా మారిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఇన్ఛార్జి మంత్రి డా.డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి, హోంమంత్రి శ్రీమతి వంగలపూడి అనిత, టూరిజం శాఖ మాత్యులు కందుల దుర్గేష్, స్పెషల్ చీఫ్ సెక్రటరీ అజయ్ జైన్, నగర మేయర్ పీలా శ్రీనివాసరావు, శాసనసభ్యులు పల్లా శ్రీనివాసరావు, విష్ణుకుమార్ రాజు, వెలగపూడి రామకృష్ణ బాబు, విఎంఆర్డిఏ చైర్మన్ ప్రణవ్ గోపాల్, జిల్లా కలెక్టర్ హరేంధిర ప్రసాద్, పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చీ, జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, ఇతర అధికారులు పాల్గొన్నారు.
Also Read : Minister Nara Lokesh: క్రీడాకారులను ప్రోత్సహించేందుకు 3శాతం స్పోర్ట్స్ కోటా – మంత్రి నారా లోకేష్
