CM Chandrababu : ఉచిత గ్యాస్ అందజేసి అతనే స్వయంగా టీ పెట్టి ఇచ్చిన సీఎం
అయితే ఈ ఉచిత గ్యాస్ కోసం రాష్ట్రంలో బుధవారం నుంచి బుకింగ్స్ ప్రారంభమైన సంగతి తెలిసిందే...
CM Chandrababu : ఆంధ్రప్రదేశ్లో ఉచిత గ్యాస్ సిలిండర్ పథకం శుక్రవారం ప్రారంభమైంది. దీపం 2.0లో భాగంగా ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం మండలంలోని ఈదుపురంలో లబ్దిదారులుకు ఉచిత గ్యాస్ సిలిండర్ను సీఎం చంద్రబాబు స్వయంగా అందజేశారు. అనంతరం లబ్దిదారుడి వంటింట్లోకి వెళ్లి సీఎం చంద్రబాబు గ్యాస్ స్టవ్ వెలిగించి.. టీ పెట్టారు. ఆ తర్వాత ఆ టీని పౌర సరఫరాల శాఖ మంత్రి నాందెడ్ల మనోహార్, కేంద్ర పౌర విమానాయాన శాఖ మంత్రి కె. రామ్మోహన్ నాయుడుతో కలిసి సీఎం చంద్రబాబు తాగారు. మరోవైపు సీఎం చంద్రబాబు(CM Chandrababu) తన నివాసానికి వచ్చి స్వయంగా ఉచిత గ్యాస్ సిలిండర్ పథకంలో భాగంగా సిలిండర్ అందజేయడం పట్ల లబ్దిదారుడి కుటుంబం ఆనందం వ్యక్తం చేసింది.
CM Chandrababu Gives..
ఇటీవల జరిగిన ఎన్నికల్లో తాము అధికారంలోకి వస్తే.. సూపర్ సిక్స్ పథకాలు అమలు చేస్తామంటూ పార్టీ మేనిఫెస్టోలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పొందు పరిచారు. ఆ క్రమంలో కూటమి ప్రభుత్వానికి ఓటరు పట్టం కట్టాడు. దాంతో సూపర్ సిక్స్ పథకాలను అమలు చేసేందుకు కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తుంది. అందులోభాగంగా శుక్రవారం ఉచిత గ్యాస్ సిలిండర్ పథకాన్ని ప్రభుత్వం ప్రారంభించింది.
అయితే ఈ ఉచిత గ్యాస్ కోసం రాష్ట్రంలో బుధవారం నుంచి బుకింగ్స్ ప్రారంభమైన సంగతి తెలిసిందే. దీపం-2 పథకంలో భాగంగా ఈ ఉచిత సిలిండర్లను ప్రభుత్వం అందిస్తుంది. ఏడాదికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇవ్వనున్నారు. దీంతో పేదలపై గ్యాస్ భారం తగ్గుతుందని కూటమి ప్రభుత్వం భావిస్తోంది. ఈ మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లను 4 నెలలకు ఒకటి చొప్పున లబ్దిదారులకు పంపిణీ చేయనున్నారు. ఇక రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు ఈ పథకాన్ని ప్రారంభించారు.
Also Read : Russia : గూగుల్ సంస్థకు రష్యా సర్కార్ భారీ జరిమానా