CM Chandrababu Naidu: కుప్పం గంగమ్మ ఆలయ పాలకమండలి కమిటీ నియామకం పూర్తి
కుప్పం గంగమ్మ ఆలయ పాలకమండలి కమిటీ నియామకం పూర్తి
CM Chandrababu Naidu : ఏపీ సీఎం చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గ కేంద్రంలోని గంగమ్మ టెంపుల్ పాలకమండలి కమిటీని సీఎం చంద్రబాబు(CM Chandrababu Naidu) నియమించారు. చైర్మన్ తో కలిపి 11 మందితో ఈ కమిటీని ఏర్పాటు చేశారు. బీఎంకే రవిచంద్ర బాబు చైర్మన్ గా, మరో 10 మందిని సభ్యులుగా నియమించారు. టీడీపీ ప్రతిపక్షంలో ఉన్న సమయంలో రెండేళ్ల పాటు కుప్పంలో రవిచంద్ర అన్నా క్యాంటీన్‌ను నిర్వహించారు. గత జగన్ ప్రభుత్వ దాష్టీకాలను ఎదిరించి అన్నా క్యాంటీన్‌ను రవిచంద్ర నిర్వహించారు. ఈ నేపథ్యంలో రవిచంద్ర సేవలకు గుర్తుగా ఈ చైర్మెన్ పదవి కట్టబెట్టినట్లు తెలుస్తోంది.
CM Chandrababu Naidu..
చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలో ముఖ్యమైన టెంపుల్ కావడంతో స్వయంగా కమిటీని ఎంపిక చేశారు. గత వైసీపీ ప్రభుత్వం గంగమ్మ టెంపుల్ కమిటీ పదవులనూ వివాదంలోకి నెట్టింది. దేవాలయం పవిత్రత, ప్రతిష్టత పెంచేలా కమిటీ ఉండాలని సీఎం చంద్రబాబు ఆలోచన చేశారు. దీనిలో భాగంగా స్వయంగా కమిటీని ఎంపిక చేశారు. ఒకటి రెండు రోజుల్లో అధికారికంగా ఉత్తర్వులు వెలువడనున్నాయి. కొత్త కమిటీలో పదిమంది సభ్యుల్లో సామాజిక సమతుల్యతకు సీఎం చంద్రబాబు ప్రాధాన్యం ఇచ్చినట్లు తెలుస్తోంది. సభ్యులుగా శారదమ్మ, నరేష్, సింధూ రాజకుమార్, మంజుల మణి, సంతోషమ్మ జయరామ నాయుడు, ఎస్ .మహేష్ ,ఎన్. వినాయకన్, వీణల శరవణన, వి ఏ.లక్ష్మి, జ్యోతిష్‌లను నియమించారు. అయితే అధికారిక ఉత్తర్వులు విడుదల చేయాల్సి ఉంది.
Also Read : Drought Hit Mandals: 51 మండలాలను కరువు మండలాలుగా ప్రకటించిన ఏపీ ప్రభుత్వం