CM Chandrababu Naidu: ఏపీ మహిళలకు చంద్రబాబు గుడ్ న్యూస్ ! ఆగస్టు 15నుంచి మహిళలకు ఫ్రీ బస్సు !

ఏపీ మహిళలకు చంద్రబాబు గుడ్ న్యూస్ ! ఆగస్టు 15నుంచి మహిళలకు ఫ్రీ బస్సు !

CM Chandrababu Naidu : ఏపీ ప్రజలకు సీఎం చంద్రబాబు పలు గుడ్ న్యూస్‌ చెప్పారు.  ఆగస్టు 15 నుంచి రాష్ట్రంలోని మహిళలందరికీ ఉచిత బస్సు(Free Bus) ప్రయాణ సదుపాయం కల్పిస్తామని సీఎం చంద్రబాబు(CM Chandrababu Naidu) తెలిపారు. దీనితో ఆగస్టు 15 నుంచి ఆడవాళ్లు ఎక్కడి నుంచి ఎక్కడికైనా రాష్ట్రంలో ఉచితంగా ప్రయాణించవచ్చు. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలో భాగంగా ఈ పథకానికి శ్రీకారం చుట్టారు. కర్నూలు జిల్లా పాణ్యం నియోజకవర్గంలో స్వర్ణాంధ్ర – స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు(CM Chandrababu Naidu) పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం పలు అభివృద్ధి సంక్షేమ పథకాల్ని ప్రకటించారు. ఈ సందర్భంగా రైతన్నలకు కూడా సీఎం చంద్రబాబు శుభవార్త చెప్పారు. కేంద్రం ఇచ్చే కిసాన్ సొమ్ములకు సరిసమానంగా రైతుల ఖాతాల్లో డబ్బులు జమచేస్తామన్నారు.

రాష్ట్రంలో పచ్చదనం పెంపొందించండని ఈ సందర్భంగా చంద్రబాబు రాష్ట్రప్రజలకు పిలుపునిచ్చారు. ప్రతినెలా మూడో శనివారం ఇళ్లు, పరిసరాల్లోని శుభ్రతపై దృష్టి పెట్టాలని కోరారు. ప్రపంచం మెచ్చుకునేలా రాష్ట్రంలో యోగా కార్యక్రమాలు నిర్వహించబోతున్నట్లు చంద్రబాబు చెప్పారు. కర్నూలులోని రైతుబజార్‌ను రూ.6 కోట్లు కేటాయించి ఆధునీకరిస్తామని సీఎం చంద్రబాబు చెప్పారు. ప్రపంచంలో ఏదీ వేస్ట్ కాదన్న చంద్రబాబు.. ప్రతి ఒక్కటీ విలువైనది. తడి చెత్త, పొడి చెత్త కాన్సెప్ట్ ను తీసుకొచ్చి పవర్ గ్రిడ్ కు శ్రీకారం చుట్టామన్నారు. త్వరలోనే దీపం పథకం లబ్ధిదారులకు డబ్బులు అకౌంట్‌లలో జమ చేస్తామన్నారు. డిఎస్సీ ద్వారా 16500 ఉద్యోగాలు స్కూల్‌లు ఓపెన్ చేసే లోపు పూర్తి చేస్తామని తెలిపారు. కేంద్రం రైతులకు ఇచ్చే అమౌంట్కు సమానంగా మూడు విడతల్లో రైతుల అకౌంట్లో డబ్బులు జమ చేస్తామన్నారు.

ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ… ‘రైతుబజార్లను 1999లో నేనే ఏర్పాటు చేశాను. రైతులకు గిట్టుబాటుధర రావాలి.. వినియోగదారులకు తక్కువ ధరకే నాణ్యమైన ఉత్పత్తులు అందజేయాలనే ఒక మంచి ఉద్దేశంతో ఏర్పాటు చేశాం. మేం తెచ్చిన రైతు బజార్ల వల్ల రైతులు లబ్ధి పొందారు, వినియోగదారులకు కూడా ఎంతో మేలు జరిగింది. కర్నూలు సి క్యాంప్‌ రైతు బజారును రూ.6 కోట్లతో ఆదర్శ రైతుబజారుగా అభివృద్ధి చేస్తాం. పక్కనే ఉన్న స్థలంలో అండర్‌ గ్రౌండ్‌ పార్కింగ్‌ సదుపాయం కల్పిస్తాం. రాష్ట్రంలో ఇప్పటి వరకు 125 రైతు బజారులు ఉన్నాయి. రాష్ట్రంలోని 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో రైతు బజార్లు ఏర్పాటు చేసే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది. రైతు బజార్లకు సేంద్రియసాగులో పండించిన కూరగాయలు వచ్చేలా చూస్తాం.

CM Chandrababu Naidu – ప్రపంచం గర్వించేలా యోగా డే నిర్వహిస్తాం – సీఎం చంద్రబాబు

ప్రపంచం గర్వించేలా విశాఖలో యోగా డే నిర్వహిస్తామని దీనికి ప్రధాని మోదీ(PM Modi) కూడా వస్తున్నారు. యోగా డేను నెలరోజులపాటు నిర్వహిస్తాం. ప్రజలకు శిక్షణ ఇస్తాం. ప్రతి ఒక్కరూ రోజుకు అరగంట యోగా చేయాలని కోరుతున్నా. ఆఫ్‌లైన్‌, ఆన్‌లైన్‌లో యోగా శిక్షణ ఇస్తాం. నెట్‌ జీరో వేస్ట్‌ కోసం ప్రజలంతా ఆలోచించాలి. ప్రపంచంలో ఏ వస్తువూ వృథా కాదు.. అన్నీ ఏదో ఒక రూపంలో ఉపయోగపడతాయి. తడిచెత్త, పొడి చెత్తను వేరు చేయాలి. అక్టోబరు 2 నాటికి రాష్ట్రంలో ఎక్కడా చెత్త లేకుండా చూడాలని ఆదేశించా. చెత్త నుంచి విద్యుదుత్పత్తి చేస్తున్నాం.. రెండు ప్రాజెక్టులు పనిచేస్తున్నాయి. రాజమహేంద్రవరం, విజయవాడ, నెల్లూరు, కడపలోనూ ప్రాజెక్టులు ఏర్పాటు చేస్తున్నాం. డ్వాక్రా, మెప్మా మహిళలు పారిశ్రామికవేత్తలుగా మారుతున్నారు.

గ్రామాల్లో చెత్తను ఎరువుగా మార్చే కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నాం. చెత్తను వేరు చేసి రీసైక్లింగ్‌కు పంపిస్తే.. వాటిని మళ్లీ వాడతారు. జపాన్‌లో ఎక్కడా రోడ్ల మీద కాగితం కనిపించదు.. అదీ సామాజిక బాధ్యత. ఆ దేశంలో రోడ్డుపై పేపర్‌ కనిపిస్తే ఇంటికి తీసుకెళ్లి చెత్తబుట్టలో వేస్తారు. మన రాష్ట్రంలో కూడా ప్రజల్లో చైతన్యం రావాలి’’ అని చంద్రబాబు అన్నారు. రాష్ట్ర మంత్రులు నారాయణ, ఎన్‌ఎండీ ఫరూఖ్‌, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్‌ ఛైర్మన్‌ పట్టాభి, జిల్లా కలెక్టర్‌ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.

Also Read : Minister Sridhar Babu : మంత్రి శ్రీధర్ బాబుకు నాంపల్లి కోర్టులో ఊరట

Leave A Reply

Your Email Id will not be published!