CM Chandrababu Naidu: విరాట్‌ కోహ్లీ రిటైర్మెంట్‌పై తెలుగు రాష్ట్రాల సీఎంల స్పందన

విరాట్‌ కోహ్లీ రిటైర్మెంట్‌పై తెలుగు రాష్ట్రాల సీఎంల స్పందన

టీమిండియా స్టార్ బ్యాట్స్ మెన్ విరాట్ కోహ్లీ… టెస్టులకు అనూహ్యంగా రిటైర్మెంట్ ప్రకటించారు. కోహ్లీ నిర్ణయంపై కొంతమంది ఆశ్చర్యానికి గురవుతుంటే… మరికొందరు మాత్రం కోహ్లీ లేని లోటు టీమిండియాకు ఉంటుందంటూ తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో… టెస్టు క్రికెట్‌కు విరాట్‌ కోహ్లీ వీడ్కోలు పలకడంపై తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబునాయుడు, రేవంత్‌రెడ్డి స్పందించారు. ఆయన నాయకత్వ లక్షణాలు లక్షల మందికి స్ఫూర్తినిచ్చాయని కొనియాడారు. మిగతా ఫార్మాట్లలో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.

అద్భుత అధ్యాయం ముగిసింది – చంద్రబాబు

 

టెస్టు క్రికెట్‌ నుంచి విరాట్‌ కోహ్లీ రిటైర్మెంట్‌తో భారత క్రీడా చరిత్రలో ఓ అద్భుత అధ్యాయం ముగిసిందని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. క్రికెట్‌లో అతడి అభిరుచి, క్రమశిక్షణ చాలా మందిలో స్ఫూర్తిని నింపాయన్నారు. విరాట్ కోహ్లీ దేశానికే గర్వకారణమని, అతడి తదుపరి ప్రయాణం.. విజయపథంలో సాగాలని ఆకాంక్షించారు.

విరాట్‌ పేరు చరిత్రలో నిలిచిపోతుంది – రేవంత్‌ రెడ్డి

 

భారత క్రికెట్‌ చరిత్రలో ‘విరాట్‌ కోహ్లీ’ ఒక గొప్ప పేరుగా నిలిచిపోతుందని తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. అద్భుతమైన క్రీడా వారసత్వాన్ని కొనసాగించాడని ప్రశంసించారు. అనేక రికార్డులు సృష్టించి, అత్యంత క్రమశిక్షణ, నిబద్ధత కలిగిన ఆటగాడిగా గుర్తింపు తెచ్చుకున్నాడని, ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచాడని కొనియాడారు. టెస్టు క్రికెట్‌ నుంచి వైదొలగుతున్నందున.. మిగతా ఫార్మాట్లలో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.

 

Leave A Reply

Your Email Id will not be published!