CM Chandrababu : గుడ్లవల్లేరు కాలేజీ ఘటనలో ఎస్సై నిర్లక్ష్యం పై భగ్గుమన్న సీఎం

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన గుడ్లవల్లేరు కాలేజ్ ఘటన...

CM Chandrababu : గుడ్లవల్లేరు కాలేజీ ఘటన.. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. హాస్టల్ బాత్రూమ్‌లో హిడెన్ కెమెరాలు బిగించి వీడియోలు చిత్రీకరించారని విద్యార్థులు భగ్గుమన్నారు. రెండ్రోజుల పాటు ఆందోళనలు చేపట్టారు. అయితే.. కాలేజీలో బందోబస్తు కోసం వచ్చిన ఎస్ఐ శిరీష విద్యార్థుల పట్ల దురుసుగా ప్రవర్థించారు. విద్యార్థులను ఒకింత బెదిరించినట్లు, బాధతో ఉన్న వారిపట్ల ప్రశ్నల వర్షం కురిపిస్తూ ఇబ్బంది పెట్టారని ఎస్ఐపై ఆరోపణలు వచ్చాయి. ఇందుకు సంబంధించిన ఆడియో, వీడియోలు సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున వైరల్ అయ్యాయి. ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న సీఎం నారా చంద్రబాబు(CM Chandrababu).. ఎస్ఐ ఓవరాక్షన్‌కు రియాక్షన్ రుచి చూపించారు..!

CM Chandrababu Slams

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన గుడ్లవల్లేరు కాలేజ్ ఘటన. విద్యార్థినుల పట్ల దురుసుగా ప్రవర్తించిన ఎస్ఐ శిరీష, గుడ్లవల్లేరు కాలేజ్ ఘటనలో ఎస్ఐ తీరుపై ముఖ్యమంత్రి ఆగ్రహం, బందోబస్తు విధుల కోసం వచ్చిన ఎస్ఐ శిరీషను వెనక్కు పంపిన అధికారులు, గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీలో రహస్య కెమెరాల అంశంపై విచారణ జరుగుతోంది. ఈ విచారణను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు(CM Chandrababu) స్వయంగా ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు, జిల్లా ఎస్పీ, కలెక్టర్ లతో మాట్లాడి విచారణపై సమీక్ష చేస్తున్నారు.ఈ ఘటనపై ఇన్ వెస్టిగేషన్ ఆఫీసర్‌గా సీఐ రమణమ్మను ఎస్పీ నియమించారు.

ఆమె నేతృత్వంలో విచారణ జరుగుతుండగా..బందోబస్తు కోసం పలు ప్రాంతాల నుంచి మహిళా పోలీసు అధికారులను, సిబ్బందిని నియమించారు, ఈ సమయంలో కోడూరు ఎస్ఐ శిరీష విద్యార్ధినులతో అనుచితంగా ప్రవర్తించిన వీడియో వెలుగు చూసింది,ఆ పోలీసు అధికారి తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి. బాధలో, ఆందోళనలో ఉన్న విద్యార్థినులతో అధికారులు దురుసుగా ప్రవర్తించడం మంచిది కాదన్న సీఎం, ఇలాంటి పోకడలను సహించేది లేదని స్పష్టం చేసిన సీఎం. ఘటనపై పోలీసు ఉన్నతాధికారలు నుంచి వివరణ కోరిన సీఎం, దర్యాప్తు బృందంలో ఎస్ఐ(SI) శిరీష లేరని.. బందోబస్తు కోసం పిలిపించామని వివరణ ఇచ్చిన అధికారులు, ఘటన అనంతరం ఆమెను ఆ ప్రాంతంలో బందోబస్తు విధుల నుంచి ఇప్పటికే తప్పించామని తెలిపిన సీఎం.

ఘటనపై ఎస్ ఐ నుంచి వివరణ తీసుకుని తదుపరి చర్యలు తీసుకుంటామని వివరించిన అధికారులు, స్టూడెంట్స్ ఆవేదనను అర్థం చేసుకుని.. వారికి భరోసా ఇచ్చేలా అధికారులు వ్యవహరించాలని సీఎం ఆదేశాలు. గుడ్లవల్లేరులో విద్యార్థులకు ఎస్ఐ బెదిరింపులు, విచారణ పేరుతో అమ్మాయిలను బెదిరించినట్లు ఆరోపణలు, విద్యార్థులు నిరసన చేయడంపై వార్నింగ్, మేం చెప్తుంటే మీరెందుకు వినడంలేదు..? ఇన్వెస్టిగేషన్ జరుగుతుంటే మీరెందుకు ఇలా చేస్తున్నారు..? ఎస్పీ అధికారి వచ్చి చెప్తున్నా మీకు అర్థం కావడం లేదా..? తిండి తిప్పలు లేకుండా పడి ఏడుస్తున్నాం, మీరు ఉన్నారంటే మీకు పర్పస్ ఉంది, మీకు బాధ్యత లేదా అని పోలీసులని ప్రశ్నించిన విద్యార్థులు, ఒక్కసారిగా విద్యార్థులపై ఆగ్రహించిన ఎస్ శిరీష, వీడియో రికార్డ్ చేయడం నువ్వు చూశావా..? మీ దగ్గర వీడియో ఉందా..? నువ్వు కళ్ళతో చూశావా..? కళ్ళతో చూస్తేనే నమ్మాలి..? అక్కడ ఏం జరిగిందో నువ్వు చూశావా..? న్యాయం కోసం ఆందోళనచేస్తున్న విద్యార్థులపై పోలీసుల ఆగ్రహం

Also Read : AP Rains : ఆంధ్రప్రదేశ్ లో వరద బీభత్సం…బయటకు రావొద్దంటున్న అధికారులు

Leave A Reply

Your Email Id will not be published!