Conrad Sangma : మణిపూర్ లో శాంతి కోసం ప్రయత్నం
సీఎం కాన్రాడ్ సంగ్మా ప్రకటన
Conrad Sangma : ఇంఫాల్ లో తాజా హింసాకాండ జరిగిన ఒక రోజు తర్వాత మణిపూర్ లో శాంతి నెలకొనేందుకు తమ పార్టీ వివిధ వర్గాల ప్రజలతో మరింతగా చేరువయ్యేందుకు చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు ఎన్పీపీ చీఫ్ , మణిపూర్ సీఎం(CM) కాన్రాడ్ సంగ్మా(Conrad Sangma).
ఇవాళ మా పార్టీ ఒక తీర్మానాన్ని తీసుకుంది. మణిపూర్ లో శాంతి నెలకొనేందుకు ప్రయత్నించాలని నిర్ణయించామన్నారు సీఎం. స్వయంగా ప్రజలతో కలవనున్నట్లు తెలిపారు. రాత్రి ఒక సమూహం కొన్ని ఇళ్లకు నిప్పు పెట్టారు. హింస, దహనం చోటు చేసుకుంది. ఈ సంఘటనలలో పాల్గొన్న వారిపై చర్యలు తీసుకున్నామని సీఎం ఎన్ బిరెన్ చెప్పారు. రాష్ట్రంలో శాంతి, సామరస్య పునరుద్దరణకు చర్యలు చేపట్టిందన్నారు.
మరో 20 కంపెనీల భద్రతా బలగాలను పంపాలని కేంద్ర సర్కార్ కు ప్రతిపాదించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు చెప్పారు. ఇంఫాల్ పశ్చిమ జిల్లా లోని ఒక ప్రాంతంలో హింస చోటు చేసుకుంది. అక్కడ దుండగులు కాల్పులకు తెగబడడంతో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. రాష్ట్రంలో పరిస్థితులు సాధారణ స్థితికి చేరుకుంటున్నాయని, వివిధ చోట్ల చిన్న చిన్న సంఘటనలు చోటు చేసుకోవడం మినహా , భద్రతా బలగాలు సకాలంలో జోక్యం చేసుకోవడం వల్ల సాధారణ స్థితికి చేరుకునేందుకు సాధ్యమైందన్నారు.
ప్రజల భద్రతకు ప్రభుత్వం అన్ని విధాల కృషి చేస్తోందన్నారు. రాష్ట్రంలో మోహరించిన భద్రతా బలగాలను ఈ సందర్బంగా ప్రశంసించారు సీఎం కాన్రాడ్ సంగ్మా. భద్రతా సిబ్బంది రాత్రంతా సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారని చెప్పారు.
Also Read : Sharad Pawar