Eknath Shinde : మరాఠా ప్రజలకు షిండే భరోసా
ఎలాంటి ఇబ్బందులు ఉండవు
Eknath Shinde : మరాఠా ప్రజలకు ఎలాంటి సమస్యలు రానీయకుండా చూడడం నా బాధ్యత. కర్ణాటక, మహారాష్ట్ర రాష్ట్రాల మధ్య సరిహద్దు వివాదం త్వరలోనే పరిష్కారం అవుతుంది. ఈ సమస్యను పరిష్కరించేందుకు కేంద్రం ప్రయత్నం చేస్తోందన్నారు సీఎం ఏక్ నాథ్ షిండే.
తాము సంయమనంతో వ్యవహరిస్తున్నామని, ఈ విషయంలో కొంచెం తగ్గితే బాగుంటుందని తాను కర్ణాటక సీఎం బస్వరాజ్ బొమ్మైకి చెప్పానన్నారు సీఎం. ఇందులో ఎలాంటి అనుమానం చెందాల్సిన అవసరం లేదన్నారు. వచ్చే వారం కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ చంద్ర షా అధ్యక్షతన తాము సమావేశం కానున్నామని తెలిపారు.
ఇందులో షాతో పాటు తాను , కర్ణాటక సీఎం బొమ్మై కూడా హాజరవుతారని వెల్లడించారు. అంత వరకు ఎవరూ ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ఏ ఒక్కరికి ఇబ్బంది కలిగినా తాను ఉన్నానని స్పష్టం చేశారు ఏక్ నాథ్ షిండే(Eknath Shinde) . సోదర భావంతో ఉండాలన్నదే తమ అభిమతమన్నారు.
పొదస్తమానం గొడవలు పెట్టుకుంటూ పోతే సమస్య తీవ్రం అవుతుందే తప్పా పరిష్కారం కాదన్నారు సీఎం. మరాఠా ప్రజలు ఎటువంటి సమస్యలు ఎదుర్కో కూడదనే తాను ప్రయత్నం చేస్తున్నానని చెప్పారు. రెండు రాష్ట్రాలకు సంబంధించి సరిహద్దు అంశం ప్రస్తుతం సుప్రీంకోర్టులో ఉందని , దీనిపై కామెంట్స్ చేయడం సరైన సమయం కాదన్నారు ఏక్ నాథ్ షిండే.
మహారాష్ట్రకు చెందిన ఎవరికీ ఎలాంటి ఇబ్బందులు రాకూడదని, ఆ విషయాన్ని చూసుకోవాల్సిన బాధ్యత తనదేనని కర్ణాటక సీఎంకు చెప్పానన్నారు. సరిహద్దు ప్రాంతాల్లో సౌకర్యాలపై ప్రత్యేక దృష్టి పెట్టామన్నారు షిండే.
Also Read : 12 జోన్లకు ఆప్ నేతల నియామకం