CM Ibrahim : ఓ వైపు పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో చతికిల పడి పునరాలోచనలో పడిన సందర్భంలో ఉన్నట్టుండి మరో షాక్ తగిలింది. కర్ణాటక కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకుడిగా ఉన్న సిఎం ఇబ్రహీం(CM Ibrahim )ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు.
ఈ మేరకు తన రాజీనామా లేఖను ఏఐసీసీ తాత్కాలిక చీఫ్ సోనియా గాంధీకి లేఖ పంపించానని వెల్లడించారు. పార్టీ ప్రాథమిక సభ్యతానికి కూడా రిజైన్ చేశానని తెలిపారు. జేడీఎస్ లో చేరేంందుకు మొగ్గు చూపుతున్నట్లు ప్రకటించారు.
ఆయన పార్టీలో సీనియర్ నాయకుడిగా ఉన్నారు. ప్రస్తుతం ఆ పార్టీ తరపున ఎమ్మెల్సీగా ఉన్నారు. కాగా మాజీ ప్రధానమంత్రి దేవె గౌడతో చర్చించాక రెండు రోజుల్లో తాను పార్టీలో చేరే విషయం తెలియ చేస్తానని చెప్పారు ఇబ్రహీం.
అంతే కాకుండా తాను ఎమ్మెల్సీ పదవికి కూడా రాజీనామా చేస్తున్నట్లు స్పష్టం చేశారు. తాను శాసనమండలి చైర్మన్ ను ఉద్దేశించి ప్రతిపక్ష నాయకుడు సిద్దరామయ్యకు లేఖ పంపించా. దానిని సమర్పించడం ద్వారా ఆమోదించే అవకాశం ఉందన్నారు ఇబ్రహీం.
బీజేపీకి కౌన్సిల్ లో మెజారిటీ ఉంది. మత మార్పిడి నిరోధక బిల్లును సులభంగా ఆమోదించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అభిప్రాయం వ్యక్తం చేశారు.
తాను వారి విజ్ఞతకే వదిలి వేస్తున్నానని చెప్పారు . సోనియా గాంధీ, రాహుల్ గాంధ, సిద్ద రామయ్య, పీసీసీ చీఫ్ డీకే శివకుమార్ కు ధన్యవాదాలు తెలిపారు. ఇక రాజీనామా చేశాను కాబట్టి తాను ఏ నిర్ణయమైనా తీసుకునేందుకు వీలుందన్నారు.
Also Read : గవర్నర్ ను కలిసిన భగవంత్ మాన్