YS Jagan : హర్షా నీ విజయం గర్వకారణం – జగన్
సంతోషం పంచుకున్న ఏపీ సీఎం
YS Jagan : తల్లిదండ్రులకు పిల్లలు ప్రయోజకులైతే ఆ ఆనందమే వేరుగా ఉంటుంది. ఆ సంతోషానికి అవధులంటూ ఉండవు. ఊహించని రీతిలో ఉన్నత స్థానంకు చేరుకుంటే ఆ కిక్కు వేరు.
తాజాగా ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి(YS Jagan), భార్య భారతీ రెడ్డి తమ కూతురు సాధించిన ప్రతిభను చూసి సంతోషానికి లోనయ్యారు. ఈ ఆనందాన్ని ట్విట్టర్ వేదికగా భార్యభర్తలు ఇద్దరూ పంచుకున్నారు.
ప్రత్యేకించి ఏపీ సీఎం వైఎస్ జగన్ రెడ్డి కూతురు హర్ష గ్రాడ్యూయేషన్ చదువుతోంది. ఆమె మంచి మార్కులు సాధించింది. ప్రపంచంలో అత్యంత పేరొందిన నగరం ప్యారిస్ లో జరిగిన ఇన్ సీడ్ బిజినెస్ స్కూల్ గ్రాడ్యుయేషన్ కార్యక్రమంలో పాల్గొన్నారు.
అనంతరం తన కూతురుపై తమకు ఉన్న ప్రేమను ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు. ఈ ట్వీట్ కు గ్రాడ్యుయేషన్ పట్టాతో ఉన్న హర్షతో సతీ సమేతంగా దిగిన ఫోటోను షేర్ చేశారు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.
ఈ సందర్భంగా కూతురుని ఉద్దేశించి ఆసక్తికర, స్పూర్తి దాయకమైన వ్యాఖ్యలు చేశారు సీఎం. ప్రియమైన ముద్దులు కూతురు హర్షకు ప్రత్యేక అభినందనలు.
నీ అద్భుతమైన ఎదుగుదలను చూస్తే ఎంతో గర్వంగా ఉందని పేర్కొన్నారు. నీకు ఆ దేవుడు చల్లని ఆశీస్సులు ఎల్లప్పుడూ మెండుగా ఉంటాయని పేర్కొన్నారు.
ఇవాళ చాలా సంతోషంగా ఉంది నిన్ను చూస్తూ ఉంటే. ఇన్ సీడ్ బిజినెస్ స్కూల్ నుంచి డిస్టింక్షన్ లో పాస్ అవ్వడమే కాకుండా డీన్స్ లిస్ట్ లో నీ పేరు చూసి గర్వ పడుతున్నానని పేర్కొన్నారు.
భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని, మరింత ఉన్నత స్థానాలు పొందాలని ఆ దైవాన్ని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు.
Also Read : ఇంజనీరింగ్ పోస్టుల భర్తీకి ఓకే