KCR Nikhat Zareen : ‘నిఖ‌త్’ కు కేసీఆర్ 2 కోట్ల న‌జ‌రానా

నిఖ‌త్ ను స‌న్మానించిన సీఎం కేసీఆర్

KCR Nikhat Zareen : తెలంగాణకు చెందిన ప్ర‌ముఖ బాక్స‌ర్ నిఖ‌త్ జ‌రీన్ ను ఘ‌నంగా స‌త్క‌రించారు సీఎం కేసీఆర్. క్రీడాకారుల‌కు ఆతిథ్యం ఇవ్వ‌డంలో, వారికి ప్రోత్సాహ‌కాలు అంద‌జేయ‌డంలో ఆయ‌న ముందంజ‌లో ఉంటారు. తాజాగా ఇప్ప‌టికే బాక్సింగ్ కేట‌గిరీలో నిఖ‌త్ జ‌రీన్ ఎన్నో ప‌త‌కాలు సాధించింది. ప్ర‌ధాని మోదీ నిర్వ‌హిస్తున్న మ‌న్ కీ బాత్ ఉత్స‌వాల్లో ప్ర‌త్యేక ఆహ్వానితురాలిగా హాజ‌రైంది.

ఇదిలా ఉండ‌గా ప్ర‌పంచ బాక్సింగ్ ఛాంపియ‌న్ గా ఉన్న నిఖ‌త్ జ‌రీన్ రాబోయే ఒలింపిక్స్ క్రీడ‌ల్లో బంగారు ప‌త‌కాన్ని సాధించాల‌ని , తెలంగాణ‌కు మ‌రోసారి కీర్తిని తీసుకు రావాల‌ని ఆకాంక్షించారు సీఎం కేసీఆర్. ఆమెకు శాలువా క‌ప్పి, జ్ఞాపిక‌ను అంద‌జేశారు.

ఇప్ప‌టికే ప‌లు ప్ర‌పంచ వేదిక‌ల మీద అద్భుత‌మైన ప్ర‌తిభా పాట‌వాల‌ను ప్ర‌ద‌ర్శించింది నిఖ‌త్ జ‌రీన్. దేశ ప్ర‌తిష్ట‌ను ఇనుమ‌డింప చేసింది. రాబోయే ఒలింపిక్ పోటీల్లో పాల్గొనేందుకు కావాల్సిన స‌హాయ స‌హ‌కారాల‌ను ప్ర‌భుత్వం అంద‌జేస్తుంద‌ని స్ప‌ష్టం చేశారు సీఎం కేసీఆర్ ఈ సంద‌ర్భంగా. ఏ స‌మ‌యంలోనైనా త‌న‌తో నేరుగా సంప్ర‌దించ వ‌చ్చ‌ని సూచించారు.

సీఎంతో నిఖ‌త్ జ‌రీన్ మ‌ర్యాద పూర్వ‌కంగా క‌లుసుకున్నారు. శిక్ష‌ణ‌, కోచింగ్, ర‌వాణా, త‌దిత‌ర ఖ‌ర్చుల‌ను స‌ర్కారే భ‌రిస్తుంద‌న్నారు. రూ. 2 కోట్ల‌ను ఇస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు సీఎం కేసీఆర్.

Also Read : Heinrich Klaasen

Leave A Reply

Your Email Id will not be published!