PBKS vs RR IPL 2023 : పంజాబ్ రాజ‌స్థాన్ బిగ్ ఫైట్

నిలుస్తారా గెలుస్తారా

PBKS vs RR IPL 2023 : హిమాచ‌ల్ ప్ర‌దేశ్ లోని ధ‌ర్మశాల కీల‌క లీగ్ మ్యాచ్ కు వేదిక కానుంది శుక్ర‌వారం. స్వంత గ్రౌండ్ లో ఓట‌మి పాలైన పంజాబ్ కింగ్స్ ఎలాగైనా స‌రే గెలుపు సాధించి ప‌రువు నిలుపు కోవాల‌ని త‌పిస్తోంది. శిఖ‌ర్ ధావ‌న్ సేన అటు బ్యాటింగ్ లో ఇటు బౌలింగ్ లో స‌త్తా చాటుతోంది. ఇక రాజ‌స్థాన్ రాయ‌ల్స్ త‌న స్వంత గ్రౌండ్ లో రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు చేతిలో చావు దెబ్బ తిన్న‌ది.

ఏకంగా 112 ప‌రుగుల భారీ తేడాతో ఓటమి పాలైంది. టోర్నీ ఆరంభంలో పాయింట్ల ప‌ట్టిక‌లో టాప్ లో ఉన్న రాజ‌స్థాన్ రాయ‌ల్స్ రాను రాను దిగ‌జారింది. ఇవాళ జ‌రిగే మ్యాచ్ ఆ జ‌ట్టుకు కీల‌కం కానుంది. అద్భుత‌మైన బ్యాటింగ్ లైన‌ప్ క‌లిగిన జ‌ట్టుగా రాజ‌స్థాన్ కు పేరున్నా ఎందుక‌నో అస‌లైన స‌మ‌యంలో చేతులెత్తేస్తోంది.

విచిత్రం ఏమిటంటే ఆయా జ‌ట్ల‌కు త‌మ హోం గ్రౌండ్ ల‌లో విజ‌యం సాధించ లేక చేతులెత్తేస్తున్నాయి. అటు చెన్నై ఇటు బెంగ‌ళూరు మ‌రో వైపు రాజ‌స్థాన్ అన్నీ ప‌రాజ‌యం పాలై ప‌రువు కోల్పోయాయి. ఇక ఇవాళ ధ‌ర్మ‌శాల‌లో ఎవ‌రు గెలుస్తార‌నే దానిపై తీవ్ర ఉత్కంఠ నెల‌కొంది.

ఇటు పంజాబ్ కు అటు రాజ‌స్థాన్ కు లీగ్ లో కేవ‌లం ఒకే ఒక్క మ్యాచ్ మిగిలి ఉంది. ఇరు జ‌ట్లు 6 విజ‌యాలు 7 ఓట‌ముల‌తో 12 పాయింట్లు క‌లిగి ఉన్నాయి. ఒక వేళ గెలిచినా ప్లే ఆఫ్స్ కు స్థానం ల‌భించ‌దు. అర్హ‌త సాధించాలంటే ముంబై ఇండియ‌న్స్ , ఆర్సీబీ, కేకేఆర్ త‌మ త‌మ లీగ్ మ్యాచ్ ల‌లో ఓడి పోవాల్సి ఉంటుంది.

Also Read : KCR Nikhat Zareen

Leave A Reply

Your Email Id will not be published!