KCR : తెలంగాణ సీఎం కేసీఆర్ ఇవాళ ముంబైకి చేరుకున్నారు. కాసేపట్లో మరాఠా సీఎం ఉద్దవ్ ఠాక్రే నివాసానికి చేరుకుటారు. అక్కడ అధికారిక సీఎం నివాసం వర్షలో ఇరువురు సీఎంలు భేటీ కానున్నారు.
ఈ సందర్భంగా దేశంలో భవిష్యత్ రాజకీయాలు, ప్రస్తుతం చోటు చేసుకుంటున్న పరిణామాలపై చర్చించనున్నారు. ఉద్దవ్ తో చర్చించిన అనంతరం ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ ను కలుస్తారు.
రాత్రి ఏడున్నర గంటల తర్వాత ముంబై నుంచి తిరిగి హైదరాబాద్ కు చేరుకుంటారు. ఇదిలా ఉండగా ఇటీవల కేసీఆర్(KCR) తన రూట్ మార్చారు. ప్రధాని నరేంద్ర మోదీ, భారతీయ జనతా పార్టీని టార్గెట్ చేశారు.
ఇది వ్యూహాత్మక ఎత్తుగడ అంటోంది కాంగ్రెస్ పార్టీ. దేశ వ్యాప్తంగా బీజేపీకి ప్రత్యామ్నాయ కూటమిని ఏర్పాటు చేసే పనిలో పడ్డారు. రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు ముగిశాక టీఎంసీ చీఫ్, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, డీఎంకే చీఫ్ , తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ మరోసారి భేటీ అయ్యే అవకాశం ఉందని సమాచారం.
ఇప్పటికే కేరళ సీఎం విజయన్ , ఆర్జేడీ నాయకులు తేజస్వి యాదవ్, సీపీఐ కార్యదర్శి ఏచూరి , డి. రాజాతో వేర్వేరు సందర్భాలలో భేటీ అయ్యారు. కేసీఆర్ చేస్తున్న ప్రయత్నాలకు వీరంతా మద్దతు తెలిపారు.
ఇవాళ ఉద్దవ్ తో భేటీ అయ్యాక జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించేందుకు దారులు ఏర్పాటు చేసుకుంటున్నారు. ఇప్పటికే తన పంథా ఏమిటో, ఉద్దేశం ఏమిటో మీడియాకు వెళ్లడించారు.
పనిలో పనిగా భారత రాజ్యాంగాన్ని మార్చాలన్న ప్రధాన డిమాండ్ ముందుకు తీసుకు వచ్చారు.
Also Read : ఓటు వేసిన భగవంత్ మాన్